YS Sharmila: చంద్రబాబు సర్కార్‌పై షర్మిల ఫైర్.. విషయమేంటంటే
YS-Sharmila (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Sharmila: కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి.. చంద్రబాబు సర్కార్‌పై షర్మిల ఫైర్.. విషయం ఏంటంటే?

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌‌లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీల (BJP) కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నూతన సంవత్సరం మొదలై ఆరు రోజులు గడిచినా ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల (Job Calender) చేయకపోవడంపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిఏటా జనవరి నెల వస్తోంది, పోతుందని, కానీ, సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నా 1వ తేదీన ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్‌కు మాత్రం దిక్కులేకుండా పోయిందని ఆమె నిలదీశారు. రికార్డు చేసి పెట్టుకోండని ఇచ్చిన వాగ్దానానికి విలువ లేకుండాపోయిందన్నారు. ఉద్యోగాల పేరుతో ఆశ చూపించారని, నిరుద్యోగుల ఓట్లను భారీగా దండుకున్నారని అన్నారు. రెండో ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఊసెత్తకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి హామీలు ఘనం, కానీ అమలులో ఘరానా మోసమంటూ ఆరోపించారు.

Read Also- Damodar Raja Narasimha: రెండేళ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పూర్తి చేస్తాం.. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం!

వైసీపీ పూలు పెడితే.. కూటమి క్యాలీఫ్లవర్లు

నిరుద్యోగ యువతను మోసం చేయడంలో ఎవరూ తక్కువ కాదంటూ విపక్ష వైసీపీపై కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట యువత చెవుల్లో పూలు పెట్టిందని, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2025 జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఎక్కడ? అని షర్మిల నిలదీశారు. రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల సంగతేంటి అని ఆమె ప్రశ్నించారు. ఇదిగో అదిగో అని ఊరించడం తప్ప ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏది? అని అన్నారు. కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు.. ఇదొక జోక్ క్యాలెండర్ అని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ బిడ్డలను దగా చేసిన దగా క్యాలెండర్ అని ఆమె వ్యాఖ్యానించారు.

Read Also- Kavitha Political Party: తెలంగాణలో సంచలనం.. కవిత కొత్త పార్టీ షురూ.. ఆ రోజే అధికారిక ప్రకటన?

50 లక్షల మంది ఎదురుచూపులు

జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా అని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఉన్నది అమ్ముకుని మరీ కోచింగులు తీసుకుంటున్నారని ఆమె ప్రస్తావించారు. ఉద్యోగాలు ఇస్తారా? లేదా అనే తీవ్ర ఆందోళనలో యువతి ఉన్నారని ఆమె ప్రస్తావించారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనాగా ఉందని ఆమె అన్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక కొలువులు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.

Just In

01

Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!