Kavitha Political Party: తెలంగాణ రాజకీయ వేదికపై కొత్త పార్టీ ఆవిష్కృతం కాబోతోంది. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) త్వరలో కొత్త రాజకీయ పార్టీ (New Political Party)ని ప్రకటించబోతున్నారు. ఉద్యమ సంస్థ అయిన తెలంగాణ జాగృతిని త్వరలో రాజకీయ పార్టీగా ఆమె మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఉగాదికి తన కొత్త రాజకీయ పార్టీని కవిత అధికారికంగా ప్రకటించే అకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో కవిత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ భేటిలోనే పార్టీని సైతం ఆమె ఖరారు చేసే ఛాన్స్ ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వచ్చే నెలలో రిజిస్ట్రేషన్..
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లు కల్వకుంట్ల కవిత ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకూ స్వచ్ఛంద సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతిని పేరు మీదనే పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కానున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఉగాది ఉండే అవకాశముందని తాజాగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పేరుతోనే కవిత ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే ప్రకటించారు.
BREAKING
తెలంగాణ రాజకీయ వేదికపై త్వరలో కొత్త పార్టీ
రాజకీయ పార్టీగా మారనున్న తెలంగాణ జాగృతి
త్వరలో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఆవిష్కరణ
ఉగాదికి కవిత రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం
వచ్చే నెలలో కవిత రాష్ట్ర స్థాయి సమావేశం
సమావేశంలో పార్టీ ఖరారు చేసే అవకాశం pic.twitter.com/pDQUu4JRjE
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2026
ఆ వర్గాల ఓట్లపై ఫోకస్!
త్వరలో స్థాపించబోయే పార్టీతో తెలంగాణలోని నిరుద్యోగులు, ఉద్యమకారులు, ఆదివాసీ, గిరిజన, దళిత, మైనార్టీ వర్గాలను ఆకర్షించాలని కవిత భావిస్తున్నారు. నిరుద్యోగులు కొత్త ఉపాధి అవకాశాల కోసం తనతో కలిసి పోరాడాలని ఆమె పిలుపునిస్తున్నారు. అలాగే అమర వీరుల కుటుంబాలకు సైతం దగ్గరయ్యేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. ఉద్యమకారులు, వారి కుటుంబాలు జాగృతితో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరి కన్నా ఆడబిడ్డల హక్కులు, అస్తిత్వం కోసం పోరాటం చేసే తనను దీవించాలని ఆమె కోరుతున్నారు. అన్ని బంధాలు, బంధానాలు తెంచుకొని అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చానని, జనం బాట మొదటి రోజే ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలు బీఆర్ఎస్ తో అన్ని రోజులు ఉన్నందున తనను క్షమించాలని కోరారు. దీన్ని బట్టి పక్కా పొలిటికల్ ప్లాన్ తోనే కవిత తన రాజకీయ అడుగులు వేయబోతున్నట్లు అర్థమవుతోంది.
Also Read: Roja On Nara Lokesh: మీరు చేసేది చాలా తప్పు.. పదింతలు అనుభవిస్తారు.. రోజా స్ట్రాంగ్ వార్నింగ్
రాజకీయంగా స్పీడప్..
కొత్త పార్టీ నేపథ్యంలో కవిత (Kavitha) రాజకీయంగా ఇక స్పీడ్ పెంచనున్నారు. ఇప్పటికే జాగృతి జనం బాట పేరుతో ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి ఆ నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. మేధావులు ఉద్యమకారులతోపాటు నిరుద్యోగ యువతతో భేటీ అవుతున్నారు. మరోవైపు, అన్ని కులాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే ఆయా సమస్యలపై ఉద్యమం బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. నిరసనలు, ధర్నా కార్యక్రమాలు సైతం చేపట్టబోతున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.

