Roja On Nara Lokesh: 'పదింతలు అనుభవిస్తారు'.. రోజా వార్నింగ్
Roja On Nara Lokesh (image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Roja On Nara Lokesh: మీరు చేసేది చాలా తప్పు.. పదింతలు అనుభవిస్తారు.. రోజా స్ట్రాంగ్ వార్నింగ్

Roja On Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)కు అధికారులు భజన బ్యాచ్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని పరామర్శించిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి సోదరులపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ తానా అంటే.. పోలీసులు తందానా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం మెసేజ్ ఇస్తున్నారు?

ఏపీలోని పోలీసు వ్యవస్థ ఎటు పోతోందంటూ మాజీ మంత్రి రోజా (Roja Selvamani) ప్రశ్నించారు. ఖాకీ చొక్కాలు ధరించాల్సిన వారు.. ఇవాళ పసుపు చొక్కాలు వేసుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారని రోజా ఆరోపించారు. ఇలా ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టుకుంటూ వెళ్తూ.. ఏం మెసేజ్ ఇస్తున్నారని నిలదీశారు. రాబోయే రోజుల్లో దీనికి పదింతలు చేయమని పరోక్షంగా సూచిస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలను భ్రష్టపట్టిస్తున్నారని మండిపడ్డారు.

‘ప్రభుత్వం తప్పు చేస్తోంది’

వైసీపీ అధినేత జగన్ (YS Jagan) చెప్పిన విధంగా గత పాలనలో తాము ఎవరి జోలికి వెళ్లలేదని రోజా పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకు అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టకుండా పాలన సాగించామన్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నది చాలా తప్పు అని రోజా విమర్శించారు. దీనికి పదింతలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

‘సీఎం, హోమంత్రి సిగ్గుపడాలి’

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోతోందని రోజా విమర్శించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన పోలీసు ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) 36వ స్థానంలో నిలిచిందని అన్నారు. దీనికి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత (Home Minister Anita) సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. మన పోలీసు వ్యవస్థను చూసి భారత దేశంలో అందరూ నవ్వుకుంటారన్న ఆలోచన వారికి రావాలని పేర్కొన్నారు. అటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ లోనూ రాష్ట్ర పోలీసు వ్యవస్థ చిట్ట చివరి స్థానానికి పడిపోయిందని రోజా ఆరోపించారు.

Also Read: Nizamabad district Crime: రాష్ట్రంలో ఘోరం.. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం.. భర్తను అతి దారుణంగా..!

‘రాయలసీమ ద్రోహి’

ప్రజలకు వెన్నుపోటు పొడవటం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని రోజా విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (Rayalaseema Lift Irrigation) ప్రాజెక్టులోనూ చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మంచిన రాయసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారా? అంటూ రోజా ప్రశ్నించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పైనా రోజా ఫైర్ అయ్యారు. రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే.. మీరు కత్తి అందిస్తున్నారా? అంటూ పవన్ ను ప్రశ్నించారు.

Also Read: Viral News: సూపర్ ఐడియా.. బైక్‌నే అంబులెన్స్‌గా మార్చేశారు.. వీడియో వైరల్

Just In

01

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!

Sathupalli News: సత్తుపల్లి మెడికల్ సిండికేట్ దందా తనిఖీల్లో అనుమానాలు..?