YS Jagan on CM Chandrababu: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Rayalaseema Lift Irrigation Project) వివాదం నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ (YSRCP) అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోడిచారని ఆరోపించారు. ఇక స్వలాభం కోసం జన్మనిచ్చిన సీమకు అన్యాయం చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడని జగన్ ఘాటు విమర్శల చేశారు.
చంద్రబాబు రహస్య ఒప్పందం
రాయసీమ నీటి వివాదంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ విధంగా తాకట్టు పెట్టారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని జగన్ అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపించామని రేవంత్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకి మధ్య ఏదో రహస్య ఒప్పంది జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని వైసీపీ అధినేత వ్యక్తం చేశారు.
తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడు : జగన్
స్వలాభం కోసం జన్మనిచ్చిన సీమకు అన్యాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చంద్రబాబు చూశారు
ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీలో చెప్పారు
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026
‘ప్రజలకు వాస్తవాలు తెలియాలి’
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని జగన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన మంత్రి.. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని చెబుతున్నారని గుర్తుచేశారు. దీన్నిబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందానికి రాజముద్ర వేసినట్లేనని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. గొప్ప ఆలోచనగా జగన్ అభివర్ణించారు. కరువు కోరల్లో చిక్కుకొని రాయలసీమలో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారిందని జగన్ అన్నారు. తాగు నీటికి సైతం ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.
Also Read: Telangana Politics: ఆ మూడు పార్టీల్లోనూ ఇదే వైఖరి.. హద్దులు మీరుతున్న నేతల విమర్శలు!
చంద్రబాబుది విలన్ క్యారెక్టర్
కరువు కాటకాల నుంచి రాయలసీమను బయటపడేయాలన్న ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. అలాంటి లిఫ్ట్ ప్రాజెక్టును అవసరం లేదని చంద్రబాబు మాట్లాడుతుండటం చూస్తే ఆయనది విలన్ క్యారెక్టర్ అని అర్థమైపోతుందని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయారని.. దీంతో నోరు మెదపలేక ప్రజలను రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాకపోవడం రాయలసీమకు దురదృష్టమని.. రాయలసీమకు చంద్రగ్రహణం పట్టిందంటూ ఘాటు విమర్శలు చేశారు.

