Pranay Amrutha Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు, అమృత బాబాయ్ అయిన శ్రవణ్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శ్రవణ్ కుమార్ కు జీవిత ఖైదు పడగా.. దానిని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పిటిషన్ పై విచారణ ముగిసేవరకూ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అతడి వయసు, జైలు జీవితాన్ని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరోమారు ప్రణయ్ పరువు హత్య కేసు తెరపైకి వచ్చింది.
ప్రణయ్ హత్య ఎలా జరిగిందంటే?
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalguda)కు చెందిన మారుతీరావు(MarutiRao) కూతురు అమృత అదే పట్టణానికి చెందిన బాలస్వామికి కొడుకు ప్రణయ్ చిన్నతనం నుంచే కలిసే చదువుకున్నారు. అమృత ప్రణయ్‌లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకున్నారు(School Age Love). ఈ క్రమంలోనే 2018లో ఇంట్లో తెలియకుండా వీరిద్దరూ ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలో అప్పటికే పేరు పలుకుబడి ఉన్న మారుతీరావు తన కూతురు కులాంతర(Inter Cast) వివాహం చేసుకుందనే కోపంతో రగలిపోయాడు. సుపారీ(Supari) గ్యాంగ్‌తో 2018 సెప్టెంబర్ 14న గర్భిణీ అయిన అమృతను ప్రణయ్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా హత్య చేయించారు. ఈ పరువు హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఎనిమిది మందిపై మిర్యాలగూడ పోలీసులు కేలు నమోదు చేశారు.
మారుతీ రావు ఆత్మహత్య..
ప్రేమ వివాహానికి ముందు వరకూ కూతురే ప్రపంచంగా బతికిన మారుతీ రావు.. ప్రణయ్ హత్య తర్వాత ఆమె తిరిగి తనవద్దకే వస్తుందని భావించారు. కానీ అమృత తండ్రిపై మరింత ద్వేషం పెంచుకుంది. పుట్టిన బిడ్డలోనే తన భర్త ప్రణయ్ ను చూసుకుంటూ గడపం ప్రారంభించింది. మరోవైపు ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి మారుతీరావును జైలుకు వెళ్లడం, సమాజంలో పరువు, కన్నకూతురు దూరమయ్యారనే బాధతో ఆయన మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలోనే 2020 మార్చిలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మరణానికి ముందు ఓ లెటర్ రాసిన మారుతీరావు.. తల్లి గిరిజ వద్దకు వెళ్లిపోవాలని కూతురు అమృతను కోరాడు. కానీ అమృత ఇప్పటికీ ప్రణయ్ కుటుంబంతో జీవిస్తోంది.
Also Read: Tirumala Liquor Bottles: తిరుమలలో మద్యం బాటిళ్లు.. పక్కా ఆధారాలతో.. వైసీపీ కుట్ర బట్టబయలు!
నల్గొండ కోర్టు సంచలన తీర్పు
ప్రణయ్ హత్యకేసుకి సంబంధించి మెుత్తం ఎనిమిది మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. అందులో తండ్రి మారుతీరావు A-1 కాగా, A-2 బీహార్‌కు చెందిన సుభాశ్ శర్మ, A-3 అజ్గర్ అలీ, A-4 అబ్దులా భారీ, A-5 ఎం.ఏ కరీం, A- 6 శ్రవణ్ కుమార్ (అమృత బాబాయ్), A-7 శివ, A-8 నిజాంలను నిందితులుగా చార్జీషీట్ లో చేర్చారు. సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం గతేడాది మార్చి 10న నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మారుతీరావు అప్పటికే మరణించడంతో ఎ-2గా ఉన్న సుభాశ్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా నిందితులందరికీ జీవిత ఖైదును ఆదేశించింది. తన జీవిత ఖైదును అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ సవాలు చేయడం.. హైకోర్డు తాజాగా బెయిల్ ఇవ్వడం గమనార్హం.

