Rangareddy District: రంగారెడ్డి జిల్లా మెుకిల పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద గురువారం తెల్లవారుజామున ఓ కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐసీఎఫ్ఏఐ కళాశాల (ICFAI College)కు చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
బర్త్ డే వేడుకల నుంచి వస్తూ..
కారులోని ఐదుగురు విద్యార్థులు.. ప్రమాదానికి ముందు ఓ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కోకాపేటలోని ఓ స్నేహితుడి ఇంట్లో జరిగిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. అక్కడ తోటి స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆటలు, పాటలతో హోరెత్తించారు. పార్టీ అనంతరం ఎకో స్పోర్ట్స్ కారులో ఐదుగురు స్నేహితులు తిరుగు ప్రయాణం అయ్యారు. మీర్జాగూడ వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా.. విద్యార్థులు కారులోని ఇరుక్కుపోయిన మృత్యువాత పడ్డారు.
అతి కష్టం మీద..
చెట్టును ఢీకొట్టిన అనంతరం ఇంజిన్ భాగం కారు క్యాబిన్ లోకి చొచ్చుకెళ్లింది. మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న మెుకిల పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన విద్యార్థుల మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అయితే విద్యార్థుల్లో ఒక యువతి ప్రాణాలతో ఉండటాన్ని గమనించి ఆమెను హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read: Keesara Police: కీసరలో కత్తుల కలకలం.. దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి చేసిన పాల వ్యాపారి!.
మృతులు వీరే..
ఈ ప్రమాదంలో చనిపోయిన విద్యార్థులను సూర్య తేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ గా గుర్తించారు. ఐసీఎఫ్ఏఐ కళాశాలలో సూర్యతేజ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. శ్రీ నిఖిల్, సుమిత్ మూడో ఏడాది విద్యార్థులకు ఉన్నట్లు సమాచారం. మరో విద్యార్థి రోహిత్ మహాత్మా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) విద్యార్థిగా పోలీసులు తెలిపారు. మరోవైపు తీవ్ర గాయాలతో బయటపడ్డ యువతిని నక్షత్రగా పోలీసులు గుర్తించారు. ఆమె బీబీఏ మూడో సంతవ్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చేతికి అందొచ్చిన బిడ్డలు కారు ప్రమాదంలో మరణించడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
మృతులు వీరే..
సూర్యతేజ (BBA-రెండో సంవత్సరం), సుమిత్ (BBA- మూడో సంవత్సరం), శ్రీనిఖిల్ (BBA-మూడో సంవత్సరం), రోహిత్ (MGIT విద్యార్థి)
ప్రమాద ఘటనలో నక్షత్ర (BBA-మూడో సంవత్సరం) అనే యువతికి తీవ్ర గాయాలు
రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ప్రమాదం
ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు… https://t.co/B5gHkuJSKq pic.twitter.com/NoTYlsz8ks
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026

