Tirumala Laddu Case: కల్తీ నెయ్యి కేసు.. తెరపైకి మరో సంచలనం
Tirumala Laddu Case (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Tirumala Laddu Case: 20 కోట్ల కల్తీ లడ్డులు.. 11 కోట్ల భక్తులకు విక్రయం.. అంగీకరించిన టీటీడీ!

Tirumala Laddu Case: తిరుమల (Tirumala Tirupati Devasthanams – TTD) కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తు ముందుకు సాగేకొద్ది కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కల్తీ నెయ్యికి సంబంధించి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు (BR Naidu) సంచలన విషయాలను వెల్లడించారు. వైకాపా అధికారంలో ఉన్న 2019-24 మధ్య 48.76 కోట్ల లడ్డులను శ్రీవారి భక్తులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే అందులో దాదాపు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసినవేనని పేర్కొన్నారు.

11 కోట్ల మంది భక్తులు..

తిరుమలలో ప్రతీ రోజూ ఉండే రద్దీ, శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య, లడ్డూ తయారీ – అమ్మకాల గణాంకాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. 2019-24 కాలంలో ఏకంగా 11 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. కల్తీ జరిగినట్లు భావిస్తున్న 20 కోట్ల లడ్డూలను ఎవరెవరు కొనుగోలు చేశారో గుర్తించడం అసాధ్యమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు వీవీఐపీలకు ఇచ్చే లడ్డూల వివరాలు కూడా తమ వద్ద ఉండవని అంగీకరించాయి.

68 లక్షల కిలోల కల్తీ నెయ్యి..

తిరుమల కల్తీ నెయ్యి అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇందులో నిజా నిజాలు వెలికి తీసేందుకు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన భోలే బాబా దాని షెల్ కంపెనీ.. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర హానికారక పదార్థాలతో నెయ్యిని కల్తీ చేసినట్లు తేల్చాయి. మెుత్తంగా రూ.250 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని భోలే బాబా డెయిరీ తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది.

Also Read: Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

వై.వి. సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం

మరోవైపు టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వై.వి. సుబ్బారెడ్డిని శుక్రవారం సిట్ బృందం విచారించింది. 8 గంటల పాటు సాగిన విచారణలో.. కల్తీ నెయ్యికి సంబంధించి పలు ప్రశ్నలు దర్యాప్తు అధికారులు సంధించారు. కల్తీ జరిగినట్లు గత ప్రభుత్వ హయాంలోనే నిర్ధారణ అయినప్పటికీ.. నెయ్యిని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. అందుకు గల కారణాలేంటో చెప్పాలని పట్టుబట్టారు. అయితే కల్తీకి సంబంధించిన అంశం తన దృష్టికి రాలేదని.. సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు నెయ్యి కొనుగోలుకు అనుమతులు ఇచ్చామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

Also Read: Hyderabad Police Dance: కమల్ హాసన్ సాంగ్‌కు.. దుమ్మురేపిన హైదరాబాద్ పోలీసులు.. ఓ లుక్కేయండి!

Just In

01

Vijay Deverakonda: అమ్మకు ప్రామిస్ చేశా.. నెక్ట్స్ సంక్రాంతికి పక్కాగా..!

Drug Awareness: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: గట్ల మహేందర్ రెడ్డి

The Raja Saab: ముగ్గురు భామలతో రాజా సాబ్.. పోస్టర్ అదిరిపోలా..!

Mahabubabad News: మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలో.. ప్రభుత్వం పై బీసీ నేతలు గుర్రు..!

Temple Theft Gang: ఆలయాలే ఆ గ్యాంగ్ టార్గెట్.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ..!