MP Srikrishna on Vidala Rajini (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

MP Srikrishna on Vidadala Rajini: ముదిరిన మాటల యుద్ధం.. విడదల రజినీకి టీడీపీ ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్

MP Srikrishna on Vidala Rajini: తన కాల్ డేటాను తీసుకున్నారంటూ మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajani) చేసిన ఆరోపణలపై టీడీపీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Srikrishna Devarayalu) గట్టి కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారన్న ఎంపీ.. తనవారికి ఒక న్యాయం, బయటివారికి ఇంకో న్యాయం ఉండదని తేల్చి చెప్పారు. అటు అమరావతిలోనూ భూములు సంపాదించారన్న దానిపై ఎంపీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

‘ఎక్కడా భూమి అడగలేదు’

ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ’40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నాం. అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమికోసం దరఖాస్తు చేసుకున్నాయి. మా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు లేదు . 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని అధిక ధర చెల్లించి భూమిని పొందాము. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంది. ఇదంతా మీతో ఎవరు మాట్లాడించారో నాకు బాగా తెలుసు’ అని ఎంపీ అన్నారు.

‘రజినీ డబ్బు తీసుకున్నారు’

వైసీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత తను ఏ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడలేదని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గుర్తు చేశారు. కానీ ఆ పార్టీకి చెందిన నేతలు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విడదల రజినీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. తనకు బూతులు రావని. రజినీలా అబ్బదాలు సైతం చెప్పలేనని ఎంపీ కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేటకు చెందిన పలువురు వద్ద నుంచి విడదల రజినీ డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. మరోవైపు ఆమెపై నమోదైన కేసుకు సంబంధించి 10 రోజుల క్రితం తన వద్దకు ఓ వ్యక్తిని పంపి రాయబారం నడిపిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. తప్పులు చేసిందంతా గాక ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎలా? అని నరసరావు పేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు.

Also Read: Attack on Mumbai Actress: అర్ధరాత్రి నటి గదిలోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు.. తర్వాత ఏమైందంటే?

రజినీ ఏమన్నారంటే

ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన విడుదల రజినీ.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుపై విమర్శలు గుప్పించారు. తనపై ఆయనకు కోపం ఉందన్న ఆమె ఆయనే ఇదంతా చేయించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తన కాల్ డేటాను ఎంపీ సేకరించారని ఆరోపించిన రజినీ.. ఇందుకు కారకులైన పోలీసులపై జగన్ హయాంలోనే చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. అయితే అప్పట్లో ఈ కాల్ డేటా వ్వవహారాన్ని గుట్టుగా ఉంచి.. ఇప్పుడు రజనీ తెరపైకి తేవడంపై ఎంటనీ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

Economic Survey TG: కండోమ్ లకే జై కొడుతున్న ఫ్యామిలీస్.. ఎకానమీ సర్వేలో వెల్లడి

Mahabubabad Crime: మరీ ఇంత దారుణమా.. ప్రియుడి కోసం బిడ్డనే.. తల్లి చేసిన ఘోరం!

Just In

01

Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?

Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్ గా మారే ప్రమాదం.. చికోటి ప్రవీణ్ సంచలన వాక్యలు

Samantha: వామ్మో.. 500 మంది మగాళ్ల ముందు హాట్ సీన్ లో రెచ్చిపోయిన సమంత..?

Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వాక్యలు

CP Anandh: నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది: సీపీ ఆనంద్