Economic Survey TG: కండోమ్ లకే జై కొడుతున్న ఫ్యామిలీస్.. ఎకానమీ సర్వేలో వెల్లడి
Attack on Mumbai Actress (Image Source: Pixabay)
Uncategorized

Attack on Mumbai Actress: అర్ధరాత్రి నటి గదిలోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు.. తర్వాత ఏమైందంటే?

Attack on Mumbai Actress: హైదరాబాద్‌ లో బాలీవుడ్ నటికి ఘోర అవమానం జరిగింది. ఓ విషయమై ముఖ్య అతిథిగా నగరానికి వచ్చిన ఆ నటికి అనుహ్య పరిస్థితి ఎదురైంది. వ్యభిచారం చేయాలంటూ నటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

నటి ఎందుకు వచ్చిందంటే?
ముంబయికి చెందిన ఓ బాలీవుడ్‌ సీరియల్ నటి (30)కి మార్చి 17న హైదరాబాద్‌కు వచ్చింది. నగరానికి చెందిన ఓ స్నేహితురాలు.. షాప్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడంతో నటి నగరంలో అడుగుపెట్టింది. ఇందుకు అవసరమైన ఫ్లైట్ ఛార్జీలు, రెమ్యూనరేషన్ గురించి కూడా ముందే ఓ ఒప్పందం కుదిరింది. అటు నగరానికి వచ్చిన నటికి ఈ నెల 18న మసబ్ ట్యాంక్ శ్యామ్‌నగర్‌కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో స్నేహితురాలు బస ఏర్పాటు చేసింది.

దాడి ఎలా జరిగిందంటే?
అపార్ట్ మెంట్ లో రెస్ట్ తీసుకుంటున్న బాధిత నటి వద్దకు మార్చి 21 రాత్రి 9 గం.లకు ఇద్దరు మహిళలు వచ్చారు. తలుపు కొట్టడంతో ఎవరో అనుకొని నటి డోర్స్ ఓపెన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు నటితో వాగ్వాదానికి దిగారు. తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రాత్రి. 11 గం.ల ప్రాంతంలో మరో ముగ్గురు పురుషులు నటి గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని బలవంతం చేశారు. ఈ క్రమంలో నటి ఎదురుతిరగడంతో ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.

Also Read: Economic Survey TG: కండోమ్ లకే జై కొడుతున్న ఫ్యామిలీస్.. ఎకానమీ సర్వేలో వెల్లడి

నటి ఫిర్యాదు
వెంటనే అప్రమత్తమైన బాలీవుడ్ సీరియల్ నటి.. డయల్ 100 కు సమాచారమిచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకోవడంతో తనకు జరిగినదంతా వారికి వివరించింది. తనను బంధించి రూ.50 వేల నగదును సైతం దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు