Market Committee Chairman: ఏపీలో పదవుల జాతర.. ఎట్టకేలకు నామినేటెడ్ భర్తీ
Market Committee Chairman
ఆంధ్రప్రదేశ్

Market Committee Chairman: ఏపీలో పదవుల జాతర.. ఎట్టకేలకు నామినేటెడ్ భర్తీ

Market Committee Chairman: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులకు సంబంధించిన ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంయుక్తంగా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది.

47 మార్కెట్ కమిటీలకు సంబంధించి, చైర్మన్లతో పాటు సభ్యులను కలుపుకుని మొత్తం 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసినట్లు సమాచారం. ఈ పదవుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు, అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు. స్థానిక స్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, వారి సూచనల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకున్నారని వారు తెలిపారు.

Also Read: Market Committee Chairman: సౌత్ చూపంతా తెలంగాణ వైపే.. సీఎం రేవంత్ వాట్ నెక్ట్స్?

ప్రస్తుతం ప్రకటించిన 47 అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవుల విషయానికి వస్తే, ఈ పదవులను కూటమిలోని మూడు పార్టీల్లో అత్యధికంగా 37 పదవులు తెలుగుదేశం పార్టీకి దక్కగా, 8 పదవులు జనసేన పార్టీకి, 2 పదవులు భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. ఈ పంపకం కూటమి ఒప్పందంలో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ అతిపెద్ద భాగస్వామిగా ఉండటం వల్ల ఎక్కువ పదవులు ఆ పార్టీకి లభించాయి. మిగిలిన మార్కెట్ కమిటీలకు సంబంధించిన చైర్మన్లను త్వరలో ప్రకటించనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది.

ఈ నామినేటెడ్ పదవుల ప్రకటనతో కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, పార్టీల మధ్య సమన్వయం, సామాజిక న్యాయం పాటించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పదవుల ద్వారా స్థానిక నాయకులకు అవకాశాలు కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో చైన్ స్నాచర్స్ హల్చల్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

మొత్తంగా, ఈ 705 నామినేటెడ్ పదవుల భర్తీతో రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అయితే ఈ నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన నేతలు నిరుత్సాహం చెందినట్లు పలువురు పేర్కొంటున్నారు.  త్వరలో మిగిలిన పదవుల ప్రకటన కోసం నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..