CM Revanth - Delimitation
తెలంగాణ

CM Revanth – Delimitation: సౌత్ చూపంతా తెలంగాణ వైపే.. సీఎం రేవంత్ వాట్ నెక్ట్స్?

CM Revanth – Delimitation: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన మార్క్ రాజకీయాలతో దూసుకెళ్తున్నారు. తొలిసారి సీఎం పీఠం అదిరోహించినప్పటికీ ఏమాత్రం తడబాటు, కన్ఫ్యూజన్ లేకుండా తనదైన విధానపర నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేశంలోనే తొలిసారి కులగణన నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణను నిలిపి చరిత్ర సృష్టించారు. అలాగే 10 నెలల కాలంలోనే ఏకంగా 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వుకు కారణమయ్యారు. ఉచిత బస్సు, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా వంటి విఫ్లవాత్మక పథకాలను తీసుకొచ్చి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతూనే మరో బృహత్తర కార్యాన్ని రేవంత్ తన భుజానపై వేసుకున్నారు. డీలిమిటేషన్ పేరుతో సౌత్ పై కేంద్రం కుట్ర చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ పోరుబాటకు సిద్ధమవుతున్నారు.

స్టాలిన్ బ్యాక్.. రేవంత్ ఇన్
2026లో కేంద్రం తలపెట్టిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి విమర్శలు ఎదురవుతున్నాయి. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ తొలి నుంచి ఈ డీలిమిటేషన్ అంశంపై పెద్ద ఎత్తున పోరాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అఖిలపక్ష భేటి (JAC) భేటి సైతం నిర్వహించారు. ప్రస్తుతం డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే కేంద్రంపై పోరులో స్టాలిన్ వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. డీలిమిటేషన్ పై రేవంత్ వైఖరిని ప్రశంసిస్తూ తాజాగా స్టాలిన్ చేసిన కామెంట్స్ సైతం ఈ ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి.

హైదరాబాద్ కేంద్రంగా భేటి
చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశానికి కొనసాగింపుగా హైదరాబాద్ లో మరో భేటికి సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. చెన్నై మీటింగ్ లో సీఎం రేవంత్ స్వయంగా జేఏసీ – 2 మీటింగ్ ను ప్రతిపాదించడం విశేషం. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏకగ్రీవంగా రేవంత్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో జేఏసీ – 2 సమావేశం జరిగే దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ పోరుకు రేవంత్ అధికారికంగా నాయకత్వం వహించినట్లైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ తనదైన లీడర్ షిప్ తో డీలిమిటేషన్ కేంద్రాన్ని ఇరుకున పెడతారని అంచనా వేస్తున్నారు.

Read Also: Earthquake in Myanmar: ఇదేం భూకంపం.. కదిలే రైలులో ప్రళయ రూపం..

ఒంటరి నుంచి నాయకత్వం దిశగా..
డీలిమిటేషన్ పై జేఏసీ 2 మీటింగ్ ఏప్రిల్ లో నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల స్పష్టం చేశారు. భేటి అనంతరం భారీ బహిరంగ సభ సైతం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఆ రోజు వేదికపై రేవంత్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్ వైఖరి కారణంగా దేశ రాజకీయాల్లో తెలంగాణ ఒంటరిగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. తిరిగి రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయంగా యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రం తప్పుడు నిర్ణయాలను రేవంత్ జాతీయ మీడియాలో నిరంభ్యంతరంగా ఎండగడుతుండటంతో బీజేపీయేతర పార్టీల్లో రేవంత్ మైలేజ్ అమాంతం పెరిగిపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ