Vinutha Kotaa Case
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Vinutha Kotaa: వినుత కోటా డ్రైవర్ కేసులో నమ్మలేని నిజాలు.. అంతా ఆ వీడియో వల్లనే!

Vinutha Kotaa: వినుత కోటా.. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కనుండే తమిళనాడులోనూ మార్మోగుతోంది. ఇందుకు కారణం.. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ కోట వినుత మాజీ డ్రైవరు, వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురికావడమే. శ్రీనివాసులును రేణిగుంటలో హత్య చేసి, అతని మృతదేహాన్ని తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని కూవం కాలువలో పడేశారు. ఈ హత్య జూలై 7న జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో కోట వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు శివకుమార్, షేక్ తాసాన్, గోపిలను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులో ఉన్న ఐదుగురిని లోతుగా విచారించగా నమ్మలేని నిజాలు బయటికొచ్చినట్లుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఇవన్నీ ఒకెత్తయితే తాజాగా కొన్ని వీడియోల వల్లనే ఈ హత్య జరిగిందనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ పోలీసులు తేల్చిందేంటి? ఏమిటా వీడియోలు అనే విషయాలు ఇక్కడ చూసేద్దాం రండి..

ఇదీ అసలు సంగతి..
ప్రాథమిక సమాచారం ప్రకారం వినుతతో శ్రీనివాసులు సన్నిహితంగా ఉండటమే హత్యకు కారణమని చెన్నై పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆ ఇద్దరి వీడియోలు ఉండటంతో నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్యనేత నిఘా పెట్టి రాయుడికి డబ్బులు ఎరచూపినట్టుగా, రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా తెలుసుకున్నట్లుగా సమాచారం. అందులో ఈ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయట. అయితే ఈ విషయాలన్నీ వినుత భర్త చంద్రబాబుకు తెలియడంతో పరిస్థితులు ఇలాగే ఉంటే కష్టమని, రాజకీయంగా.. వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు తప్పవని భావించి పక్కా ప్లాన్ రచించారట. తొలుత పీఏగా విధుల నుంచి తప్పించి.. ఆ తర్వాత మట్టుబెట్టాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు తేల్చినట్లుగా తెలిసింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఆ వీడియోలు, ఫొటోలు బయటికి రావడంతో వాటిని చూసి జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు.. వినుత, రాయుడిని కొట్టాడట. అనంతరం నలుగురు వ్యక్తుల సాయంతో కలిసి శ్రీనివాసులను శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టి చంపినట్లుగా చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడ్నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియాలోని కూవం నదిలో పడేసి ఎంజాయ్ చేస్తూ ఆంధ్రాకు తిరిగొచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మృతుడి చేతిపై జనసేన గుర్తు, వినుత పేరు పచ్చబొట్టుగా ఉండటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సీసీటీవీ ఫుటేజీలు, హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కోట వినూత దంపతులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Read Also- Kota Srinivasa Rao: లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు గురించి మీకేం తెలుసు.. ఇంట్రెస్టింగ్ విషయాలివే!

కర్త.. కర్మ.. క్రియ!
ఇవన్నీ ఒకెత్తయితే.. వినుత కోట తన బెడ్రూమ్‌లో బట్టలు మార్చుకునేప్పుడు రాయుడు ఫోన్ కెమెరాతో వీడియోలు తీశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియా ఇదే విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే.. రాయుడితో ఈ పని చేయించారని ఆరోపణలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఆ వీడియోలన్నీ ప్రత్యర్థులకు రాయుడు చేరవేసినట్లుగా సమాచారం. ఈ విషయాలన్నీ తెలిసే తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని, రాయుడి వల్లే తన పొలిటికల్ కెరీర్ ఇలా అయ్యిందనే భావనలో వినుత ఉన్నట్లుగా తెలిసింది. అరెస్ట్ అనంతరం కోర్టుకు తరలిస్తుండగా మీడియాతో రెండంటే రెండు మాటలే మాట్లాడిన వినుత.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ మాపైన బొజ్జల సుదీర్ కుట్ర చేశాడు. బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి కథ చూస్తాం. ఒక మహిళ రాజకీయాల్లో ఉంటే ఇంత కక్ష సాధింపు చర్యలా? అన్ని విషయాలు బయటపెడతాను. సుధీర్ హస్తం ముమ్మాటికీ ఉంది’ అంటూ వినుత దంపతులు హెచ్చరించారు. నిజంగా రాయుడి కేసులో ఇదొక ఊహించని ట్విస్టే అని చెప్పుకోవచ్చు. కాగా, హత్యకు ముందు బాత్రూమ్‌లో దాక్కున్న రాయుడిని తలుపులు పగలకొట్టి మరీ గోడౌన్ తీసుకెళ్లి చంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్‌లోనే శ్రీనివాసులు చేసిన తప్పులపై అతని చేత మాట్లాడించి వీడియో తీసారని సమాచారం. ఈ విషయాలన్నింటిపైనా చెన్నై పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తున్నది.

Read Also- Viral News: హెల్మెట్‌కు సీసీ కెమెరా.. ఎందుకు చేస్తున్నాడంటే?

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ