School Bus Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగరాజపూరం మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో బస్సులో చివరి సీట్లలో కూర్చున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా.. వారిలో ఓ విద్యార్థి నాలుక తెగిపోయింది.
Also Read: Woman Constable Suicide: వరంగల్లో ఘోరం.. ఇద్దరు యువకుల వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్
వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు.. బస్సులోని విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులకు సమాచారం అందించడంతో వారు కూడా ఘటన స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
స్కూలు బస్సును ఢీకొట్టిన లారీ
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎస్ఆర్ పురం సమీపంలోని జీడీనెల్లూరు వైపు వెళ్తుండగా బీసీ కాలనీ వద్ద స్కూలు బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయాలు.. తెగిపోయిన ఓ విద్యార్థి నాలుక
విద్యార్థులను చికిత్స నిమిత్తం… pic.twitter.com/ObbbsRZwvU
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2026

