Archana Ravichandran: పవిత్ర కొండపై బుల్లితెర నటి వెకిలి చేష్టలు..
Archana-Ravichandran
ఎంటర్‌టైన్‌మెంట్

Archana Ravichandran: పవిత్ర కొండపై బుల్లితెర నటి వెకిలి చేష్టలు.. సీరియస్ అయిన అధికారులు..

Archana Ravichandran: భక్తికి, ఆధ్యాత్మికతకు నిలయమైన తిరువణ్ణామలైలో నిబంధనలు ఉల్లంఘించినందుకు బుల్లితెర నటి అర్చన రవిచంద్రన్, నటుడు అరుణ్ ప్రసాద్‌లు అటవీశాఖ చర్యలకు గురయ్యారు. అనుమతి లేకుండా పవిత్రమైన అరుణాచల కొండను ఎక్కినందుకు వీరికి అధికారులు జరిమానా విధించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న 2,668 అడుగుల ఎత్తైన కొండపైకి వెళ్లడంపై అటవీశాఖ ప్రస్తుతం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ, అడవి జంతువుల భద్రత అడవిలో మంటలు చెలరేగే ప్రమాదం ఉన్న దృష్ట్యా సాధారణ ప్రజలు కొండ ఎక్కడాన్ని అటవీశాఖ కఠినంగా నిషేధించింది. కేవలం ‘మహాదీపం’ వంటి పండుగ సమయాల్లో మాత్రమే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తారు.

Read also-Kanchana Re-Release: హరర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మరింత క్లారిటీతో ‘కాంచన’ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

సోషల్ మీడియా పోస్టుతో చిక్కులు

తమిళ సీరియల్ ‘రాజా రాణి 2’ ద్వారా గుర్తింపు పొందిన అర్చన రవిచంద్రన్, ఇటీవల నటుడు అరుణ్ ప్రసాద్‌తో కలిసి ఈ కొండను ఎక్కారు. అక్కడ దిగిన ఫోటోలు వీడియోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అటవీశాఖ అధికారుల దృష్టికి చేరింది. అనుమతి లేని ప్రాంతంలో వారు ఎలా ప్రవేశించారనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు.

Read also-The Maze: శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ ఎలా ఉందంటే?

అటవీశాఖ చర్యలు

అటవీ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను అధికారులు కఠినంగా వ్యవహరించారు. నటి అర్చన రవిచంద్రన్ కు రూ. 5,000 జరిమానా విధించారు. నటుడు అరుణ్ ప్రసాద్ కు కూడా రూ. 5,000 జరిమానా విధించారు. అనుమతి లేకుండా అడవి ప్రాంతంలోకి ప్రవేశించడం చట్టరీత్యా నేరమని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. పవిత్రమైన కొండను పర్యాటక ప్రాంతంగా భావించి నిబంధనలు అతిక్రమించవద్దని అటవీశాఖ భక్తులను కోరుతోంది. కొండ చుట్టూ చేసే ‘గిరిప్రదక్షిణ’కు ఎటువంటి ఆంక్షలు లేవని, కానీ కొండపైకి వెళ్లాలంటే కచ్చితంగా ముందస్తు అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. సెలబ్రిటీ హోదాలో ఉండి నిబంధనలు పాటించకపోవడంపై సోషల్ మీడియాలో కూడా మిశ్రమ స్పందన వస్తోంది. చట్టం ముందు అందరూ సమానమేనని అటవీశాఖ తీసుకున్న ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?