Modi AP Tour
అమరావతి, ఆంధ్రప్రదేశ్

PM Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. భారీగా ఏర్పాట్లు.. ఎందుకంటే..?

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేయనున్నారు. ఇందుకుగాను భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే.. జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈవేడుకులకు మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు. మే 2న ప్రధాని అమరావతికి వచ్చినపుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో ‘Yoga for One Earth, One Health’ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది.

Modi Yoga

యోగాంధ్ర-2025
ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన తెచ్చేందుకు ఇప్పటికే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా గత మార్చి 13 నుండి జూన్ 21 వరకు 100 రోజుల్లో 100 నగరాల్లో 100 ఆర్గనైజేషన్ల పేరిట గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యోగాంధ్ర-2025’ నినాదంతో ప్రజల్లో యోగాపట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల భాగస్వామ్యంతో సుమారు 2లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించి విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29 నుంచి 4 వారాల పాటు నాలుగు అంచెల ప్రచార కార్యక్రమ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. ఈనెల 29 నుంచి మొదటి వారం రోజులు అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో యోగా అవగాహన ప్రచార కార్యక్రమాలు, జూన్ 5 నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో, జూన్ 12 నుంచి వారం రోజుల పాటు గ్రామ స్థాయిలో, జూన్ 17 నుంచి విద్యా సంస్థల స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది.

CS Vijayanand

కట్టుదిట్టంగా ఏర్పాట్లు..
విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించారు. కావున ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 8వ తరగతి మొదలు డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పిఈటీలు, స్పోర్ట్స్ కోచ్‌లు, విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని విజయానంద్ సూచించారు. మరోవైపు.. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి వర్చువల్‌గా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్‌ను ఖరారు చేస్తామని, రెండు లక్షల టీ షర్టులు, యోగా మ్యాట్లను రాష్ట్రానికి పంపనున్నట్టు చెప్పారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ వేడుకల్లో సుమారు రెండు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు జరగబోతున్నాయి. కాగా, విశాఖలో ఈ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించాలి అనేది ఖరారు చేయాల్సి ఉంది.

CS On Yoga Day

Read Also- Samantha: వామ్మో.. వైఎస్ షర్మిలను ఇమిటేట్ చేసిన సమంత.. పెద్ద రచ్చే జరుగుతోందిగా!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం