Perni Nani
ఆంధ్రప్రదేశ్

Perni Nani: పేర్ని నాని కొంపముంచిన అత్యాశ.. అందుకే ఈ పరిస్థితి..!

Perni Nani: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఎమోషనల్ అయ్యారు. ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’కి ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోడౌన్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. తన భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కాసేపటికి తేరుకున్న నాని తిరిగి మాట్లాడటం కంటిన్యూ చేశారు. ఎప్పుడూ ఇల్లు వదిలి బయటికిరాని జయసుధ (Perni Nani Wife Jayasudha) పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడం, విచారణ ఇవన్నీ చూసి మాజీ మంత్రి అప్పట్లో తీవ్ర భావోద్వేగానికి లోనైన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఇంతకీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం మాట్లాడారు? ఏయే విషయాలపై ఎలా స్పందించారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం రండి.

Read Also- Andhra Pradesh: చంద్రబాబు పచ్చి అబద్దాలు.. సూపర్ సిక్స్‌పై నిస్సిగ్గుగా ప్రకటన!

Perni Jayasudha

ఆ రోజే చెప్పాను..
‘ మేం రాజకీయాలు చేసే ప్రత్యర్థులు ఇలాంటోళ్లు అవ్వడంతో ఈ పరిస్థితి వచ్చింది. సివిల్ సప్లయ్స్‌లో మా భార్య పేరిట గోడౌన్ (Perni Nani Godown) కట్టాం. సబ్సిడీ వస్తుందని మా ఆవిడ పేరుతో నిర్మించాం. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని ఇలా చేశాం. అద్దె వస్తుందని ఆశపడ్డాం. రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినా అద్దె వస్తుందని అనుకున్నాం. నెక్స్ట్ పోర్టు వస్తోంది.. గవర్నమెంట్ కాకపోయినా ఏదో ఒకటి వస్తుందని అనుకున్నాం. ఇందులో తప్పేముంది? తప్పు చేస్తే తప్పు, లంచాలు తింటే తప్పు.. ఇంకా ధౌర్జన్యం చేస్తే తప్పు. నేను అద్దె ఆశించి కట్టుకున్నాను అందులే తప్పేముంది? గోడౌన్ విషయంలో తప్పు జరిగిందని చెబుతున్నారు. అవును.. ఆ తప్పులో మా పాత్ర ఎంతో..? సివిల్ సప్లయ్స్ పాత్ర కూడా అంతే. అది జాయింట్ రెస్పాన్సిబులిటీ. ఆ డిపార్ట్‌మెంట్, మా గోడౌన్ స్టాఫ్ కలిసి ఏదో చేశారు.. తప్పు జరిగిపోయింది. కానీ, నాకు, నా భార్యకు, నా కుటుంబానికి కానీ ఏ పాపం, పుణ్యం తెలియదు. నేను ఆ రోజే చెప్పాను. నేను దేవుడి కంటే.. చనిపోయిన నా తల్లి, అమితంగా ప్రేమించిన అమ్మంటే ఇష్టం. దేవుడి కంటే తల్లి మీదే భక్తి ఎక్కువ. ఆ తల్లి మీదే ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ రోజే (కేసు జరిగినప్పుడే) చెప్పాను. ఆ తర్వాత ఇలాంటి తప్పులు జరగడం సర్వసాధారణం సివిల్ సప్లయ్స్ అధికారులు అందరూ చెబుతున్నారు. అన్ని గోడౌన్లలో ఇలా జరిగింది.. షార్టేజ్ వస్తుందని చెప్పారు’ అని పేర్ని నాని చెప్పారు.

Perni Godown

నాకేం అవసరం?
నేను నిజంగానే ఈ విషయం కప్పిపెట్టే వాడినే అయితే 22వేల మెట్రిక్ టన్నులు అంటే ఇంచుమించు ఒక షిప్ (ఓడ)లో పట్టే బియ్యాన్ని నేను ఏదైనా చేయాలనుకుంటే చేయలేనా? రాత్రికి రాత్రే లారీలు పెట్టి ఏదైనా చేసేవాడ్ని కదా?. నా దగ్గర కేజీకి రూ.90 వసూలు చేశారు. పెనాల్టీతో సహా ఇలా చేస్తారని కూడా నాకు తెలుసు. గవర్నమెంట్ వాల్యూ రూ.45 మాత్రమే. రిమాండ్ రిపోర్టులో మాత్రం రూ.10కు అమ్మానని రాశారు. అంటే కేజీ 10 రూపాయిలు అమ్మి, రూ.90 కట్టడానికి నేను దొంగతనం చేస్తానా? 40 రూపాయిలు వాల్యూ ఉన్న దాన్ని 10కే అమ్మి.. ఎలా కప్పిపెట్టగలను? అది అయ్యే పనేనా? కాదు కదా. రిమాండ్ రిపోర్టులో కేజీ 10 రూపాయిలు అని వాళ్లే చెప్పారు. అవును.. ఇవన్నీ చూస్తుంటే మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లో నా పేరు ఉందనే అర్థం చేసుకోవాలి. సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ చరిత్రలో .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇంతవరకూ నా మీద తప్పితే వేరొకరి మీద క్రిమినల్ కేసు లేదు. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి సీజ్ ద షిప్ (Seize The Ship) అన్నారు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సీజ్ ద గోడౌన్ అంటూ 31 గోడౌన్లను సీజ్ చేశారు కానీ.. ఎక్కడా, ఎవడి మీదా కేసు లేదు. డిపార్ట్‌మెంట్ పుట్టాక తొలిసారి నాపైనే క్రిమినల్ కేసు పెట్టారు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటి? నా దగ్గర కోటి రూపాయిలా డెబ్బై లక్షలు కట్టించుకొని కూడా నా భార్యపైన కేసులు పెట్టారు. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయడమే వాళ్ల మెయిన్ టార్గెట్ అని పేర్ని నాని వెల్లడించారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో నాని చెప్పారు.. ఇంకెందుకు ఆలస్యం బిగ్ టీవీ యూట్యూబ్‌ ఛానెల్‌లో చూసేయండి మరి.

Read Also- Thalliki Vandanam: తల్లికి వందనం నిజంగానే సూపర్ సక్సెస్ అయ్యిందా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు