Thalliki Vandanam: కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో (Super Six) ఒకటైన ‘తల్లికి వందనం’పై లేనిపోని అనుమానాలు, చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. మొన్న అంతా అస్సలు డబ్బులు పడలేదని.. నిన్న రూ.2వేలు కటింగ్స్ ఎందుకనీ?, ఇవాళ చూస్తే.. దీంతో అసలు ‘‘ తల్లుల పేరుతో లీలలు ‘వంధ’నం వింతలు’’ అంటూ సాక్షి దినపత్రికలో కథనం రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆ పేపర్ క్లిప్‌ను జతచేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి (YS Jagan Mohan Reddy). మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చేయనివ్వం. జగన్ రెడ్డి కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్ది’ అని లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి వైసీపీ నేతలు, పార్టీ శ్రేణుల కామెంట్స్ అటుంచితే జనసేన, టీడీపీ కార్యకర్తలే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఒకే ఫ్యామిలీలో 94 మంది, ఇంకా 337 మందికి ఇచ్చినట్టు ఉంది అది నిజమా కాదా లోకేష్? ఒకవేళ ఇచ్చుంటే మాత్రం ఖచ్చితంగా అది మ్యానువల్ ఎర్రర్. అసలు సిస్టం ఎలా తీసుకుటుంది? ఒకే ఇంట్లో 337 మంది అంటే.. ఏంటిది?’ అని కూటమి పార్టీల కార్యకర్తలే ప్రశ్నిస్తున్న పరిస్థితి.
బొక్క బోర్లాపడ్డారా?
లోకేష్ ట్వీట్‌కు ముందు వైసీపీ (YSR Congress) కూడా ఓ ట్వీట్ చేసి దుమారం రేపింది. ‘ జనం తిడుతుండంతో లేకలేక.. ఏడాది తర్వాత ఒక్క పథకం అమలు చేయడానికి ట్రై చేసి గంటల్లోనే బోర్లాపడిన చంద్రబాబు, నారా లోకేష్. తల్లికి వందనం లబ్ధిదారులు జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి. బటన్ నొక్కడం పెద్ద పనా? అని వెటకారం చేసిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఒక్క బటన్ నొక్కలేక ముప్పుతిప్పలు పడుతున్నారు’ అని కూటమి సర్కార్‌పై వైసీపీ సెటైర్లు వేసింది. దీనిపై వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు స్పందిస్తూ.. ‘ ఒక్కరికే 341 మంది పిల్లలు క్రియేట్ చేయడం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అని కొందరు వైసీపీ కార్యకర్తలు సినిమా డైలాగులు పేల్చుతున్నారు. వాట్సప్ గవర్నెన్స్ అని తెగ హడావుడి చేశారు కదా..? ఇంతకీ అది పనిచేస్తోందా.. లేదా? అని ప్రశ్నిస్తున్న వాళ్లు ఉన్నారు. బహుశా సచివాలయ సిబ్బందికి డేటా ఎంట్రీ చేయడం రాదేమో? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. ‘ తప్పులు చూపెట్టండి అంతే కానీ, పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు’ అని కొందరు నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
ఏది నిజం..?
ఇదిలా ఉంటే.. వైసీపీ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ పిన్ చేసి పెట్టింది.‘ తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి.. కొంత మందికి మాత్రమే రూ.13వేలు ఇచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ మిగిలిన రూ.2వేలును తల్లులను మోసగిస్తూ L ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది. అయితే దీనిపై లోకేష్ స్పందిస్తూ నిరూపించాలని సవాల్ చేశారు కానీ.. ఇంతవరకూ వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు ఈ ట్వీట్లకు స్పందిస్తూ.. ‘ మీరు అమలు చేస్తున్న పథకాలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలే. వాటికి మీరు పేర్లు మార్చి మేము అది చేశాం.. ఇది చేశాం.. అది ఇచ్చాం ఇది ఇచ్చాం అంటున్నారు. ముందు ఆ పథకాలని స్థాపించింది ఎవరో చూసుకోండి ఫస్ట్.. జై జగన్’ అంటూ మాజీ సీఎంపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చూశారుగా.. అటు లోకేష్ ఏమో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటుంటే.. ఇటు వైసీపీ మాత్రం అట్టర్ ప్లాప్ అంటూ తన అనుకూల దినపత్రిక, టీవీ చానెల్స్‌లో.. సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఇందులో నిజానిజాలెంతో..? అబద్ధం ఎంతో అనేది తెలియాలంటే కచ్చితమైన డేటా వస్తే తప్ప గానీ తెలిసే పరిస్థితి లేదు.
#PsychoFekuJagan#TallikiVandanam
తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి
జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా… pic.twitter.com/GhgmEkpKJJ— Lokesh Nara (@naralokesh) June 15, 2025