Nara Lokesh
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Nara Lokesh: నారా లోకేష్ వంద రోజుల ఛాలెంజ్.. నెంబర్ వన్ సాధ్యమేనా?

Nara Lokesh: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వంద రోజుల ఛాలెంజ్ తీసుకున్నారు. ఈ వంద రోజుల్లో మంగళగిరిని (Mangalagiri) గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని వ్యూహ రచన చేస్తున్నారు. అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని 100 రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని లోకేష్ ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్‌ను నెం.1గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయి.

Read Also- Gadwal Incident: తేజేశ్వర్ హత్య కేసులో కీలక అప్డేట్.. పచ్చి నిజాలు చెప్పేసిన బ్యాంక్ మేనేజర్!

Swachh Andhra

నేను రెడీ.. మీరు!
ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఈ కాంపాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనున్నారు. ఎంటీఎంసీ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు రూ.1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు రూ.1.2 కోట్ల విలువైన రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛ మంగళగిరి సాధనకు ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్‌ను అధికారులు స్వీకరించాలన్నారు. వంద రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ ఛాలెంజ్ ను తాము స్వీకరిస్తున్నామని, స్వచ్ఛతలో మంగళగిరిని నెం.1 తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Read Also- YS Jagan: ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. తండ్రికి మించిన తనయుడువి అయితివే!

షోరూమ్ సందర్శన..
మరోవైపు.. విజయవాడ గవర్నర్ పేటలోని ఎఫ్ఎమ్ ప్లాజాలో మంగళగిరికి చెందిన వ్యాపారవేత్త చల్లా నాగరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన దేవి ధామ్ సిల్వర్ షోరూమ్‌ను రిబ్బన్ కట్ చేసి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్‌ను సందర్శించారు. అందరితో కలిసి కలివిడిగా లోకేష్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read Also- Stuntman Raju: షాకింగ్.. ఇండస్ట్రీలో మరో విషాదం.. మాస్టర్ ప్రాణం తీసిన స్టంట్..!

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?