stunt men raju( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Stuntman Raju: షాకింగ్.. ఇండస్ట్రీలో మరో విషాదం.. మాస్టర్ ప్రాణం తీసిన స్టంట్..!

Stuntman Raju: తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఓ సినిమాకు స్టంట్స్‌ చేస్తుండగా స్టంట్‌మ్యాన్‌ రాజు(Stuntman Raju) గుండెపోటుకు గురై మరణించారు. హీరో ఆర్య (Arya) డైరెక్టర్‌ పా. రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఈ ఘటన జరిగింది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో.. కారుతో స్టంట్స్‌ చేస్తుండగా స్టంట్‌మ్యాన్‌ రాజు గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన చిత్ర బృందం సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు తెలపడంతో సినిమా యూనిట్ మొత్తం విషాద ఛాయలు నెలకొన్నాయి. తన కెరీర్ మొదటి నుంచీ ఎన్నో స్టంట్స్ చేసిన రాజు అకాల మరణం అక్కడ ఉన్నవారికి బావోద్యేగానికి గురిచేసింది. ఆయన మృతికి కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హీరో విషాల్ అయితే మరో అడుగు ముందుకు వేసి తన దయా హృదయాన్న చాటుకున్నారు. స్టంట్‌మ్యాన్‌ రాజు కుటుంబానికి ఏం అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం విషాల్ మాట్లాడుతూ.. రాజు తాను చేసినా చాలా సినిమాల్లో స్టంట్‌మ్యాన్‌ గా చేశారని ఆయన చాలా ధైర్యవంతుడని కొనియాడారు.

Also Read – Nimisha Priya: నిమిషాకు ఎల్లుండే ఉరి.. ఏమీ చేయలేమన్న కేంద్రం

స్టంట్‌మ్యాన్‌ రాజు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. గ్రేట్‌ కార్‌ జంపింగ్‌ స్టంట్‌ ఆర్టిస్ట్స్‌లో రాజు ఒకరని ఆయన చేసిన ప్రతి స్టంట్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయిని, స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ సిల్వ అన్నారు. చిత్ర పరిశ్రమ మంచి స్టంట్‌మ్యాన్‌ ను కోల్పోయిందని అన్నారు. స్టంట్‌ యూనియన్‌ ఆయన్ని చాలా మిస్‌ అవుతోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. హీరో ఆర్య, డైరెక్టర్‌ పా. రంజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్‌పట్ట’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా స్టంట్స్ చేస్తుండగా సెట్స్‌లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వెంటనే అందరూ స్పందించినా… గుండెపోటు కారణంతో ఆయన్ని కాపాడలేకపోయారు.

Also Read – Adulterated Toddy: ప్యాకెట్ కల్లు తాగి దంపతులకు అస్వస్థత

దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఉంది. అందులో స్టంట్‌మ్యాన్‌ రాజు కారు స్పీడుగా వచ్చి ఓ ఎత్తును ఢీ కొని తిరగడడింది. కారు మొత్తం ధ్వంశం అయింది. రాజు ఎంతకీ లేవకపోవడంతో అందరూ ఆయన వద్దకు పరుగులు పెట్టారు. అప్పటికే రెడీగా ఉన్న అంబులెస్స్ లోకి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అయితే రాజు మాత్రం అన్ని సేఫ్టీ నియమాలు పాటించారు. అయినా రాజు నుంచి స్పందన లేకపోవడంతో హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటు రావడంతో మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో మూవీ టీం మొత్తం సోక సంద్రంలో మునిగిపోయింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు