Nara Lokesh(Image Credit: Twitter)
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: వైసీపీ గొడవలు సృష్టిస్తోంది.. లోకేష్ సీరియస్ కామెంట్స్

Nara Lokesh: రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కావాలనే కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని మంత్రి లోకేష్ ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సంఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సంఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఇలాంటి డ్రామాలను మరిన్ని నడిపే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు.

Also Read: వంగవీటికి సీఎం హామీ.. నామినేటెడ్ పదవా? రాజ్యసభకు పంపుతారా?

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో వైసీపీపై విమర్శలు గుప్పించిన లోకేష్, ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదని పేర్కొన్నారు. రెడ్ బుక్‌లో ఉన్న వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దోషులను గతంలో చెప్పినట్లు గానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని లోకేష్ తేల్చి చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కేవలం Z కేటగిరీ భద్రత మాత్రమే ఉండగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి Zప్లస్ కేటగిరీ భద్రత ఉందని లోకేష్ పేర్కొన్నారు. అయినా కూడా పరదాలు కట్టుకుని తిరుగుతున్నారని ఆయన వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజమండ్రి పోలీసులు, ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నప్పటికీ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రోజుకో వీడియో బయటికొస్తోంది. దీంతో అసలు ఏది నిజమో ప్రజలకు అర్థం కాని పరస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులకు సైతం పాస్టర్ మృతి మిస్టరీగానే మిగిలింది.

Also Read: గట్టిగా నిలబడతా.. 2.0 ఏంటో చూపిస్తా.. జగన్ వార్నింగ్

ఒకరోజు వైన్ షాప్ దగ్గర ఉన్నట్లు, పార్కు బయట కూర్చుని ఉన్నట్లు వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ వీడియోలన్నీ మార్ఫింగ్ అని క్రైస్తవ సంఘాలు కొట్టిపారేస్తున్నాయి. సోమవారం నాడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. గొల్లపూడి సమీపంలో పెట్రోల్ పట్టించే సమయానికే బైక్ హెడ్‌లైట్ పగిలిపోయింది. పెట్రోల్ బంక్‌ సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?