Karnataka Bus Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. బెంగళూరు నుండి గోకర్ణకు వెళ్తున్న బస్సును, హిరియూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ డివైడర్ దాటి ఢీకొట్టడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఓక్కసారిగా బస్సులో మంటలు అంటుకున్నాయి. బస్సులో దాదాపుగా 17 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం. ఇక వివరాల్లోకి వెలితే ఉన్నాయి.
Also Read: Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు
ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం
కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా, NH-48 హైవేపై ఈ ప్రామాదం జరిగింది. బెంగళూరు నుండి గోకర్ణకు వెళ్తున్న బస్సును, హిరియూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ డివైడర్ దాటి ఢీకొట్టడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మరణించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. మంటల్లో ఇరుక్కుపోయి పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. గాయపడ్డ వారిని అక్కడి అధికారులు సిరా, హిరియర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సఅందిస్తున్నారు. బస్సు ప్రమాదంలో బాధితులకు వైద్యం అందించేందుకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు కూడా సిద్ధంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశించారు. దీంతో ఘటన స్థలానికి చిత్రదుర్గ ఎస్పి రంజిత్ చేరుకున్నారు. కాలిపోయిన బస్సు శకలాలు రోడ్డుపై నుంచి అధికారులు తొలగించి ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
Also Read: AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

