Thalliki Vandanam
ఆంధ్రప్రదేశ్

Thalliki Vandanam: పేరు మార్చినంత మాత్రాన ‘తల్లికి వందనం’ కొత్తదైపోతుందా..?

Thalliki Vandanam: తల్లికి వందనం పథకం అందరికీ గుర్తుంది కదా..? అదేనండోయ్ వైసీపీ హయాంలో ‘అమ్మ ఒడి’ (Amma Vodi) ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ‘తల్లికి వందనం’ మిగిలినదంతా సేమ్ టూ సేమ్. వాస్తవానికి.. అమ్మ ఒడి అనే పేరుకు జనాలు బాగా అలవాటు పడిపోయి.. తల్లికి వందనం అనే మాటే మర్చిపోయారు. పల్లెటూర్లలో నాటి నుంచి నేటి వరకూ అమ్మ ఒడే అంటున్న పరిస్థితి. అంటే అమ్మ ఒడి నుంచి పుట్టిన పథకమే తల్లికి వందనం. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే పేరు మార్చారు, కొన్ని నియమ నిబంధనలు మాత్రమే మార్చారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నది వైసీపీ వాదన. అయితే.. ‘తల్లికి వందనం’ పథకం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆలోచనతో నుంచి పుట్టింది..? అని సీఎం చంద్రబాబు పుట్టపర్తి మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో వ్యాఖ్యానించడంతో ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో దీనిపైన పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఈ రెండు పథకాలకు తేడా ఏంటి? ఈ పథకం ఎలా పుట్టింది..? ఎవరు ప్రారంభించారు..? చంద్రబాబు అన్న ఆ ఒక్క మాటతో జనాలు ఏమని చర్చించుకుంటున్నారు..? వైసీపీ, నెటిజన్ల నుంచి వస్తున్న రియాక్షన్ ఏమిటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో చూసేద్దాం రండి..!

Read Also- Chandrababu: చంద్రబాబు మనసు గెలిచిన బాలుడు.. ఏం చేశాడంటే?

‘అమ్మ ఒడి’ పుట్టు పూర్వోత్తరాలు
ఈ పథకం ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. రాష్ట్రంలో అనేక కుటుంబాలు పేదరికంలో మగ్గుతుండటంతో, పిల్లలను బడికి పంపడానికి ఆర్థిక భారం ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లో, పిల్లలను బడికి పంపడం కంటే ఏదైనా పనికి పంపి కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచన ప్రబలంగా ఉండేది. దీనివల్ల బడి మధ్యలోనే పిల్లలు చదువు మానేయడం (డ్రాపౌట్) చాలా ఎక్కువగా ఉండేది. విద్యతోనే ఒక కుటుంబం, ఒక సమాజం అభివృద్ధి చెందుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ గుర్తించింది. పేదరికం కారణంగా ఏ ఒక్క చిన్నారి కూడా విద్యకు దూరం కాకూడదనే దృఢ సంకల్పంతో ఈ పథకాన్ని రూపొందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో ‘నవరత్నాలు’ అనే తొమ్మిది కీలక హామీలను ప్రకటించింది. ఈ నవరత్నాలలో ‘అమ్మ ఒడి’ పథకం ఒక ప్రధాన హామీగా చేర్చబడింది. ఎన్నికల ప్రచారంలో జగన్ ఈ పథకం గురించి విస్తృతంగా వివరించారు. దీని ద్వారా పేద తల్లులకు ఆర్థిక సహాయం అందించి పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ‘నవరత్నాలు’ అమలుపై దృష్టి సారించారు. అందులో భాగంగా, అమ్మ ఒడి పథకం రూపకల్పన, విధివిధానాలపై కసరత్తు చేశారు.

Ammavodi

ప్రధాన లక్ష్యాలేంటి?
పేదరికం కారణంగా పిల్లలు బడి మానేయకుండా చూడటం, పాఠశాలల్లో హాజరును పెంచడం, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం. రాష్ట్రంలో మొత్తం అక్షరాస్యత శాతాన్ని పెంచడం. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి విద్యను అందించడానికి ప్రోత్సహించడం. పథకాన్ని ప్రారంభించిన తర్వాత, అర్హత ప్రమాణాలు, నిబంధనలను రూపొందించారు. దీని ప్రకారం, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పిల్లల తల్లులకు (లేదా పిల్లలకు సంరక్షకులుగా ఉన్నవారికి) ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో వెయ్యి రూపాయిలు పాఠశాల నిర్వహణ నిధికి కేటాయించబడుతుంది. మిగిలిన రూ.14 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, ‘నాడు-నేడు’ అనే బృహత్తర కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు. మొత్తంగా, పేదల పిల్లలకు విద్యను చేరువ చేయాలనే సామాజిక లక్ష్యంతో, పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో ‘అమ్మ ఒడి’ పథకం ఆవిర్భవించింది.

Read Also- Nayanthara: భర్తతో విడాకులు.. మరోసారి సంచలన పోస్ట్ పెట్టిన నయనతార?

తల్లికి వందనం కథేంటి?
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒకటిగా ‘తల్లికి వందనం’ హామీ ఇచ్చింది. గత పథకం కంటే మరింత విస్తృతంగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేద పిల్లల విద్యను ప్రోత్సహించడం లక్ష్యం. అర్హులైన తల్లులకు సంవత్సరానికి రూ.15వేలు అందిస్తారు (అందులో వెయ్యి పాఠశాల నిర్వహణ నిధికి, రూ.14వేలు తల్లి ఖాతాలో జమ చేస్తారు). 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పిల్లల తల్లులు (లేదా సంరక్షకులు) అర్హులు. ఇక్కడ ముఖ్యమైన తేడా ఏమిటంటే.. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే, ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుతుంటే, తల్లికి రూ.30వేలు అందుతుంది. అమ్మ ఒడి పథకానికి ఉన్న చాలా అర్హత నిబంధనలు (75% హాజరు, తెల్ల రేషన్ కార్డు, ఆదాయ పరిమితులు మొదలైనవి) ఈ పథకానికి కూడా వర్తిస్తాయి. అమ్మ ఒడి పథకంలో ఒక కుటుంబానికి ఒకే విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం లభించగా, తల్లికి వందనం పథకంలో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే, వారందరికీ విడివిడిగా ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ మార్పు వల్ల ఎక్కువ మంది విద్యార్థులు, తల్లులు లబ్ధి పొందుతారని ప్రభుత్వం చెబుతున్నది. చూశారుగా.. నాటి అమ్మ ఒడి, నేటి తల్లికి వందనం పథకాల విషయాల్లో ఎంత తేడా ఉందనేది. ఇప్పుడు చెప్పండి ఎవరి ఆలోచనల్లో నుంచి పథకం పుట్టిందో ఆ కథేంటో..!

Thalliki Vandadanam

ఇవేం కామెంట్స్ బాబోయ్?
చంద్రబాబు కామెంట్స్ పైన సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ‘ మొన్న హైవేలు నేనే అన్నారు. నిన్న పాలు పితకడం నేర్పింది నేనే అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులు మేమే అన్నారు. పాపం లోకేష్ అన్న ఏడ్చాడు అనుకుంటా ఒకటన్నా నాకివ్వు అని అందుకే ఇది క్రెడిట్ ఇచ్చారు. ఇవన్నీ కాదులే కానీ అసలు మీరు కనిపెట్టనిది ఈ భూమి మీదే ఉండదు. అలా ఏదైనా ఉంటే అది అసలు ఈ భూమికి సంబంధించినదే కదూ..? ఏం మనుషులు రా నాయనా అసలు’ అని వైసీపీ వీరాభిమాని ఒకరు సైటైర్ కురిపించారు. అంతేకాదు.. కూటమి కార్యకర్తలు కొందరు సైతం అమ్మ ఒడి నుంచే వచ్చిందని నిజం ఒప్పుకుంటున్నారు. అవును.. లోకేష్ ఆలోచనల్లో నుంచి వచ్చింది పేరు మాత్రమే.. పథకం కాదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ‘ పేరు మార్చినంత మాత్రాన పథకం కొత్తదైపోదు..!’ అని ఇంకొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ క్రెడిట్ కొట్టేయడంలో నిజంగా మీ ఇద్దరి తర్వాతే దేశంలో ఎవరైనా. కానీ మీకొక సలహా, దేన్నైనా ట్రై చెయ్యండి ఈ పథకం తప్ప. ఎందుకంటే ఇప్పటికీ జనాలు దీన్ని అమ్మ ఒడి అనే పిలుస్తున్నారు’ అని జగన్ వీరాభిమానులు చెబుతున్నారు. ఇక డీజే టిల్లులోని ‘ ఏయే బాబూ.. లెవ్వు’ అనే మీమ్స్, జిఫ్ ఫొటోలు అయితే తెగ కామెంట్ల రూపంలో వచ్చిపడిపోతున్నాయి.

Read Also- Viral News: టెన్నిస్‌ క్రీడాకారిణిని కాల్చిచంపిన తండ్రి.. ఆ రీల్‌లో ఏముందో?

 

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు