AP Cabinet
ఆంధ్రప్రదేశ్

AP Cabinet: డేంజర్ జోన్‌లో నలుగురు ఏపీ మంత్రులు.. వేటుకు రంగం సిద్ధం!

AP Cabinet: అవును.. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లోని నలుగురు మంత్రులు డేంజర్ జోన్‌లో ఉన్నారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వీరితో పాటు ముగ్గురు మంత్రులు హిట్ లిస్టులో ఉండగా, వారిపై వేటుకు రంగం సిద్ధమైందని తెలియడంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు కొందరికి శాఖల మార్పు కూడా తథ్యమని టాక్ నడుస్తోంది. దీంతో మంత్రి పదవి ఉండెవరికి.. ఊడేదెవరికి..? అసలు కేబినెట్‌లో ఏం జరుగుతోందని కూటమి పార్టీల్లో గందరగోళం నెలకొన్నది. ఇవన్నీ ఏవో రూమర్స్ లేదా ప్రచారం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పోనీ ఇవన్నీ ఎవరు చెబుతున్నారు..? ప్రభుత్వం నుంచి కానీ, ఇంకా కేబినెట్ నుంచి ఎవరైనా లీకులు చేశారా..? అంటే అదీ కాదండోయ్.. అసలు విషయాలు తెలియాలంటే కాస్త ఓపిగ్గా ఈ ప్రత్యేక కథనం చదివేయండి మరి.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మంత్రుల పేర్లు కూడా ఉండటమే.. ఇంకెందుకు ఆలస్యం రండి మరి షురూ చేసేద్దాం..!

Read Also- MLC Kavitha: తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్లు

ఇదీ అసలు కథ..
వాస్తవానికి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రివర్గ ప్రక్షాళన గురించి చాలా రోజులుగానే ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, పనితీరు సరిగా లేని, ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న కొందరు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే అవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. 2024 ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలై.. కూటమి పార్టీ నెగ్గుతుందని సర్వే చేయించి మరీ చెప్పిన ‘రైజ్’ గ్రూప్ ఛైర్మన్ ప్రవీణ్ పుల్లాట (Praveen Pullata) ఎక్స్ వేదికగా ఈ కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. ఆ మంత్రులు ఎవరు ఏమిటనేది కూడా ప్రకటిస్తూ అందరికీ షాకిచ్చారు. ఆయన ట్వీట్ సారాంశం ఏమిటంటే.. ‘ వాసంశెట్టి సుభాష్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎస్. సవిత. హిట్ లిస్టులో మరో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. వారిపై వేటుకు కూడా రంగం సిద్ధం అవుతున్నది. శాఖల మార్పు కూడా జరగొచ్చు. గొట్టిపాటి, కొల్లు రవీంద్ర పేరుకు మాత్రమే మంత్రులు నడిపేది అంతా పైవాళ్ళు!’ అని అని పోస్టు చేశారు. ఈ ట్వీట్ క్లియర్ కట్‌గా అర్థమైంది కదా.. అదీ అసలు సంగతి.

Read Also- Vinutha Kotaa: వినుత కోటా డ్రైవర్ కేసులో నమ్మలేని నిజాలు.. అంతా ఆ వీడియో వల్లనే!

ఎంతవరకూ నిజం?
కొందరు మంత్రులు తమ శాఖల్లో అనుకున్న స్థాయిలో పనితీరు కనబరచడం లేదనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడటం, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం వంటివి కారణాలుగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులపై స్థానికంగా వ్యతిరేకత పెరుగుతోందని, ఇది పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. వ్యక్తిగత ప్రవర్తన, వివాదాస్పద వ్యాఖ్యలు.. అవినీతి ఆరోపణలు కూడా దీనికి కారణం కావొచ్చు. పార్టీ అధిష్టానం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), మంత్రుల పనితీరుపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. కొన్ని సమీక్షల్లో మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపును పటిష్టం చేసుకోవాలంటే, కేబినెట్‌లో మార్పులు అవసరమని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం ద్వారా పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంతో పాటు, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయాలని చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి.. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఇటువంటి ప్రక్షాళనలు మామూలే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, త్వరలోనే అంటే రాబోయే కొద్ది నెలల్లోనే ఈ కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Read Also- Nandamuri Balakrishna: ‘బాలకృష్ణ కాండ్రించి ఉమ్మేశాడు’… కోట శ్రీనివాసరావు

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?