Nandamuri Balakrishna: తెలుగు సినిమా చరిత్రలో నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. ఆయన చేసిన విలన్ పాత్రలు విలనిజానికే కొత్త భాష్యం నేర్పేవిగా ఉన్నాయి. విలన్‌గా, కామెడియన్‌గా, కామెడీ విలన్‌గా అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిస్వాశ విడిచిన విషయం తెలిసిందే. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కెరీర్ మొదట్లో కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేసేవారు. 1978లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’తో సినిమాల్లోకి ఆరంగ్రేటం చేశారు. తర్వాత రోజుల్లో తెలుగుతో పాటు హీందీ తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. సుమారు 750 కుపైగా చిత్రాల్లో నటించారు. నాలుగు దశాబ్దాల పాటు నడిచిన నటనా జీవితంలో ఆయన తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు. 1999 లో విజయవాడ తూర్పు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన సినిమాలకు అందించిన సేవలకు గాను 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.
Also Read – Raja Singh: రాజాసింగ్‌కు ముళ్లబాటేనా.. మున్మందు సవాళ్లు తప్పవా?
కోట శ్రీనివాసరావుకు నటనపై ఉన్న ఆసక్తితో స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రంగస్థల నాటకాలు వేసేవారు. కోట ఆసక్తిని గమనించిన దర్శక నిర్మాత క్రాంతికుమార్ వెండి తెరపై మొదటి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి కోట విభిన్న పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు. సూపర్‌స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర, యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ‘ప్రతి ఘటన’, ‘ఆహనా పెళ్ళంట!’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం: 786’, ‘శివ’, ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘ఆమె’ ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించారు. ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో తన నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కోట చెప్పారు. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు ప్రేక్షకులతో పంచుకున్న కోట నందమూరి బాలకృష్ణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read –Viral News: హెల్మెట్‌కు సీసీ కెమెరా.. ఎందుకు చేస్తున్నాడంటే?
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు బాలకృష్ణతో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. జంధ్యాల సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లినపుడు అనుకోకుండా బాలకృష్ణ ఎదురవగా నమస్కారం బాబు అని చెప్పానన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం కోట వంక చూసి కాండ్రించి ఉమ్మేసాడని తెలిపారు. అప్పుడు బాలయ్య బాబు ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి నమస్కారం పెడితే అలా చేశారని బాధ పడ్డారు. అంతకు ముందు కొట నటంచిన ‘మండలాదీసుడు’ సినిమాలో ఎన్టీఆర్ ను పోలిన పాత్ర ఒకటి చేయాల్సి వచ్చింది. అందులో కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ ను వక్రీకరిస్తూ ఉండటంతో బాలయ్య అలా చేశారని వివరించారు. ఎలాంటివారికైనా తన తండ్రిని తిడితే కొపం వస్తుందని బాలయ్య విషయంతో కూడా అలాగే జరిగిందని తెలిపారు. దీనిని చూసిన నెటిజన్లు మాత్రం నటనలో కొన్ని సార్లు అలాంటి పాత్రలు వేయాల్సి వస్తుంది. అయితే మాత్రం బాలయ్య అలా చేయడం సమంజసం కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. తర్వాత కాలంలో బాలయ్య, కోట కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.