Sankranti Holidays: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. విద్యార్థులు ఉహించిన దానికంటే ఎక్కువ రోజులను ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా తొమ్మిది రోజుల పాటు సంక్రాంతి సెలవులను మంజూరు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సెలవుల అనంతరం జనవరి 19వ తేదీన (సోమవారం) తిరిగి స్కూళ్లు తెరుచుకుంటాయని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారిక ప్రకటన ప్రకారం 2026 ఏడాదికి గాను సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ (శనివారం) నుంచి మెుదలుకానున్నాయి. 10వ తేదీన రెండో శనివారం రావడం, 11వ తేదీన ఆదివారం రావడం, తిరిగి 18వ తేదీన మళ్లీ ఆదివారం రావడం సంక్రాంతి సెలవులకు కలిసొచ్చింది. దీంతో సెలవు రోజులు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే జనవరి 12న (సోమవారం) ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా విద్యాశాఖ సెలవు మంజూరు చేసింది. అలాగే 13న బోగీ, 14న సంక్రాంతి, 15న సంక్రాంతి సందర్భంగా ఎప్పటిలాగే సెలవులు ఇచ్చారు. ఇక 16, 17 తేదీల్లోనూ ప్రత్యేకత లేనప్పటికీ తిరుగు ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ సెలవులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాంటే ఇంటర్, డిగ్రీ కాలేజీలకు సంబంధించి కూడా సంక్రాంతి సెలవులను రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.
Also Read: Man Married Thrice: కంత్రి భర్త.. మూడేళ్లలో ముగ్గురిని పెళ్లాడాడు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్యలు
ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణపై పడింది. ఇక్కడి విద్యాశాఖ ఎన్ని రోజులు సెలవులు ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. అయితే సాధారణంగా ఏపీతో పోలిస్తే తెలంగాణలో సంక్రాంతి చాలా పరిమితంగా జరుపుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఏపీతో పోలిస్తే తెలంగాణలో సంక్రాంతి సెలవులు కాస్త పరిమితంగానే ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 12 నుంచి 18వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. ఇందులో ఆదివారం కూడా కలిసి ఉండటం గమనార్హం. ఈసారి ఏపీ తరహాలో ఎక్కువ రోజులు ఇవ్వాలని తెలంగాణ స్కూల్ విద్యార్థులు కోరుకుంటున్నారు.

