AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ భేటిలో పలు అంశాలపై మంత్రి వర్గం చర్చించి ఆమోద ముద్ర వేసింది. మెుత్తంగా 35 అంశాలకు మంత్రులు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. వాటిలో పలు కీలక నిర్ణయాలు సైతం ఉన్నాయి. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేబినేట్ కీలక నిర్ణయాలు..
రూ.200 కోట్ల వ్యయంతో నిర్మితం కానున్న 45 ఎంఎస్‌ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి లభించనున్నట్లు ఏపీ కేబినేట్ అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలను ఆమోదింది. బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ. 5 వేల కోట్ల రుణం సమకూర్చుకునేందుకు అంగీకరించింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.#AndhraPradesh pic.twitter.com/QeTe98PkkH
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 8, 2026
స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటును మంత్రివర్గం అమోదించింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్‌లు పంపిణీకి రూ. 944.53 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు. CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినేట్ భేటిలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా పాల్గొన్నారు.
Also Read: CM Revanth on PM Modi: పేదలపై కక్షతో.. పథకాన్నే మార్చేస్తారా.. మోదీకి సీఎం రేవంత్ సూటి ప్రశ్న
ప్రపంచంతో పోటీ పడాలి: సీఎం
మరోవైపు కేబినేట్ భేటి అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. ఏపీలో అమలవుతున్న పీపీపీ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులకు సంబంధించి ఫోర్బ్స్ జాబితాలో ఏపీకి చోటు దక్కడం అందరికీ గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వ విజయాలను, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ‘రూ.4,490 కోట్ల ట్రూఅప్ చార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తోంది. విద్యుత్ ధర యూనిట్ కు రూ.5.19 నుంచి రూ.4.90కి తగ్గించాం. మార్చి నాటికి రూ.4.80కి తగ్గించడమే లక్ష్యం. లాజిస్టిక్స్ లో ప్రపంచంతో పోటీ పడాలి. ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఒక పోర్టు ఏర్పాటు కావాలి. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి’ అని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు.

