CM Revanth on PM Modi: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనక ప్రధాని మోదీ కుట్ర ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదలపై కక్షతో ఈ పథకాన్నే మారుస్తారా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. నిబంధనల ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మెజారిటీ ఉందని, చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే కుదరదన్నారు.
‘ప్రజలకు క్షమాపణ చెప్పాలి’
మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఉన్న విధంగా కొనసాగిస్తానని మోదీ ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే సమయంలో దేశ ప్రజలకు సైతం క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. మరోవైరు రూపురేఖలు మార్చిన ఉపాధి పథకం చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం సైతం చేసినట్లు రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలోని 12 వేల మంది సర్పంచ్ లు కూడా తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. దీని అమలు కోసం 15 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న మంత్రులను.. ఇన్ ఛార్జీలను నియమించాలని పీసీసీని ఆదేశిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 30 వరకూ ఒక్కొక్క మండలానికి ఒక్కరు బాధ్యత వహిస్తారని చెప్పారు. తాను కూడా ఒక మండలానికి బాధ్యత వహిస్తానని చెప్పారు.
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై మోదీ కుట్ర: సీఎం
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనక ప్రధాని మోదీ కుట్ర ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదలపై కక్షతో ఈ పథకాన్నే మారుస్తారా? అని ప్రశ్నించారు. నిబంధనల ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర… pic.twitter.com/ig6n95jfPh
— ChotaNews App (@ChotaNewsApp) January 8, 2026
Also Read: Hyderabad Crime: తరుచూ ఫోన్ మాట్లాడటంపై.. ప్రశ్నించిన లవర్.. సూసైడ్ చేసుకున్న ప్రేయసి
బీజేపీ చాలా ప్రమాదకరం: భట్టి
మరోవైపు ఇదే సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. సామ్రాజ్యవాదుల కంటే బీజేపీ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, రాజకీయ సంస్కరణలు దేశంలో సామాజికంగా, ఆర్థికంగా కీలక మార్పులు తీసుకొచ్చాయని భట్టి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీప్రభుత్వం ఒక్క కొత్త చట్టం తీసుకు రాకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నిటిని రద్దు చేసే కార్యక్రమం చేపట్టిందని విమర్శించారు. కొత్త ఉపాధి చట్టం రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దమని.. ప్రభుత్వంలోని పెద్దలు అంతా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని భట్టి స్పష్టం చేశారు.

