ONGC Gas Blowout: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన ఓన్‌జీసీ బ్లోఅవుట్ మంటలు పూర్తిగా ఆరిపోయాయి. దీంతో అక్కడి శకలాలను ఓన్‌జీసీ విపత్తు నిర్వహణ బృందం తొలగించింది. బావి చుట్టూ ఉన్న కాలిపోయిన డ్రిల్లింగ్ గ్రిడ్ మెటీరియల్ ను సిబ్బంది పూర్తిగా తొలగించారు. అయితే గత ఆరు రోజులుగా బ్లోఅవుట్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంటలు ఆర్పేందుకు ఓన్ జీసీ, అగ్నిమాపక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు. మంటలు ఎగసిపడ్డ బావిపై నిరంతరాయంగా నీటిని చల్లుతూనే వచ్చారు. అంతేకాకుండా గ్యాస్ లీకేజీ తీవ్రతను తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టారు. అనేర రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమించడంతో ఎట్టకేలకు బ్లోఅవుట్ మంటలు అదుపులోకి వచ్చాయి.
రెయింబవళ్లు శ్రమించి..
కోనసీమ జిల్లా పాసర్లపూడిలో గతంలో ఒకసారి బ్లోఅవుట్ జరగ్గా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపు 60 రోజుల సమయం పట్టింది. ఇరుసుమండలోనూ అలాంటి పరిస్థితే పునరావృతం అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పలు రెస్క్యూ బృందాలు రెయింబవళ్లు కష్టపడి మంటలను అదుపుచేసేందుకు యత్నించడంతో చివరకూ మంటలు శాంతించాయి. దీంతో ఇరుసుమండతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఆరు రోజులుగా ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ గడిపాడమని.. ఎట్టకేలకు మంటలు చల్లారడం భారీ ఊరటను కలిగిస్తోందని చెప్పారు. అయితే మరోమారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Gold Rate Increased: అమ్మబాబోయ్.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఒక్క రోజులో ఏకంగా..!
ఎటు చూసినా బూడిదే..
బ్లౌఅవుట్ కారణంగా ఓన్ జీసీ బావి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు తగలబడిపోయాయి. కొద్ది మీటర్ల మేర మంటలు ఎగసిపడటంతో వాటి జ్వాలలో ఆహుతయ్యాయి. బ్లౌఅవుట్ అనంతరం ఆ ప్రాంతమంతా మాడి మాసైపోయి దర్శనమిస్తోంది. ఈ నెల 5న తొలి రోజు 20 మీటర్ల మేర మంటలు ఎగసిపడగా.. రోజు రోజుకు జ్వాలల ప్రభావం తగ్గుతూ వచ్చింది. క్రమం తప్పకుండా వాటర్ ను బ్లౌఅవుట్ మీద వాటర్ అంబ్రెల్లా చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చిందని రెస్య్కూ బృందాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బావిని మూసివేసేందుకు ఓఎన్ జీసీ సిబ్బంది సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. తాముకూడా వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశామని.. కానీ 5 రోజుల్లోనే మంటలు అదుపు చేయగలగడం ఆనందాన్ని ఇస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఇరుసమండలిలో పూర్తిగా అదుపులోకి వచ్చిన మంటలు
6 రోజులుగా వెల్ క్యాపింగ్ చేసిన ONGC అధికారులు, అగ్నిమాపక సిబ్బంది
దింతో అదుపులోకి వచ్చిన మంటలు
ఈనెల 5న ONGC వద్ద గ్యాస్ లీకేజీ ఘటన
గ్యాస్ లీక్ అవ్వడం వల్ల గత ఐదు రోజులుగా భారీగా ఎగసిపడిన మంటలు pic.twitter.com/ekVBZ7Y3C7
— BIG TV Breaking News (@bigtvtelugu) January 10, 2026
ఇకనైనా రక్షణ కల్పిస్తారా?
ఇరుసుమండ బ్లౌఅవుట్ చల్లారిన నేపథ్యంలో ఇకనైనా తమ రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఓన్ జీసీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇష్టారీతిన బావులు తవ్వేయడాన్ని అధికారులు అడ్డుకోవాలని పట్టుబడుతున్నారు. ఒకవేళ గ్యాస్ కోసం బావులు తవ్వినా.. ఆ సమాచారాన్ని ముందే తమకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్లౌఅవుట్ లాంటి ఘటనలు జరిగితే ప్రజల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా తెలియజేయాలని కోరుతున్నారు.

