Traffic Restrictions Amravati (imagecredit:AI)
అమరావతి

Traffic Restrictions Amravati: మోడీ సభ ఎఫెక్ట్.. ఆ రూట్లో వాహనాలు బంద్!

ఆంధ్రప్రదేశ్: Traffic Restrictions Amravati: రాజధాని అమరావతిలో మే 2,న ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. అమరావతిలో రాజధాని పనుల శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన మరియు బహిరంగ సభవున్నందున సభ సజావుగా సాగడానికి జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజల సౌకర్యం కొరకు ఆరోజున ట్రాఫిక్ మళ్లింపులు చేయబడుతున్నామని పోలీసులు తెలిపారు.

భారీ వాహనములు, లారీల మళ్లింపులు :

చెన్నై వైపు నుండి విశాఖపట్నంన వచ్చే వాహనాలను విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపుకు వెళ్ళు భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి చీరాల- బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ- పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది. చిలకలూరిపేట నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరి పేట నుండి NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడుతాయని పోలీసులు తెలిపారు.

చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడుతాయని, గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలును బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి – వేమూరు- కొల్లూరు – వెల్లటూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడుతాయని అన్నారు.

Also Read: Deputy CM on Terror Attack: రోహింగ్యాలపై.. పవన్ సంచలన కామెంట్స్

గన్నవరం వైపు నుండి హైదరాబాద్ కు వయా ఆగిరిపల్లి – శోభనాపురం గణపవరం వెళ్లాలని అన్నారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు: హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు – మైలవరం జి. కొండూరు – ఇబ్రహీంపట్నం వైపు భారీ గూడ్స్ వాహనాలు వెళ్ళవలెను.

మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక సూచనలు :

చెన్నై నుండి విశాఖపట్నం ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు మరియు నెల్లూరు వద్ద జాతీయ రహదారి దగ్గర మళ్లింపు లేకుండా నిలిపివేయబడతాయి. విశాఖపట్నం నుండి చెన్నై ఈ వాహనాలు హనుమాన్ జంక్షన్ మరియు పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి దగ్గర ఆపివేయబడతాయని, ఆగిన అన్ని మల్టీ-యాక్సిల్ వాహనాలు మే 2న రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగడానికి అనుమతించబడతాయని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు ప్రయాణీకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Also Read: Tv Actress :పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. షాక్ లో అబ్బాయిలు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం