అమరావతి, స్వేచ్ఛ: Yarlagadda Venkata Rao: గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం అసెంబ్లీలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచాక ఏదో చేద్దాం అనుకున్నానని, మీడియాతోనూ చెప్పాను, కానీ ఈ తొమ్మిది మాసాలలో ఏమీ చేయలేకపోయానని నైరాశ్యం వ్యక్తం చేశారు. ఇంతకన్నా దరిద్రం ,దౌర్భాగ్యం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదుపై కనీసం ఎంక్వైరీ అయినా చేశారా అని ఆరా తీస్తే ఎంక్వైరీ కూడా చేయలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ అంశంపై చర్చ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ, ఇది సమయం కాదంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అనడం వినిపించింది. ఈ వీడియో క్లిప్పింగ్‌ను కూటమి ప్రభుత్వంపై విమర్శలకు వైసీపీ శ్రేణులు ఉపయోగించుకున్నాయి.
సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 9 నెలల కూటమి పాలన ఏవిధంగా ఉందో టీడీపీ ఎమ్మెల్యే మాటాల్లోనే స్పష్టమవుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే పనులు జరగడం లేదని చెబుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలని వైసీపీ సోషల్ మీడియా పేజీలు సెటైర్లు వేస్తున్నారు.
Also Read: AP Cabinet: జగన్ కు ఝలక్.. పేర్లు మార్చేసిన ప్రభుత్వం.. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయం..
సహకార కేంద్ర బ్యాంకుల్లో అవినీతి
కాగా, సహకార కేంద్ర బ్యాంకుల్లో 2019-24 మధ్య కాలంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అసెంబ్లీలో సోమవారం పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ జాబితాలో యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉన్నారు. హౌస్ కమిటీ వేసి ఐఎఎస్ అధికారిని విచారణా అధికారిగా నియమించాలని వెంకట్రావు కోరారు.
Also Read: TTD News: శ్రీవారి దర్శన టికెట్ల జారీలో మార్పులు.. కీలక ప్రకటన జారీ చేసిన టిటిడి..
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సహకార కేంద్ర బ్యాంకుల్లో అవినీతి అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి, 2019-24 మధ్యకాలంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని సమాధానం ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా అవినీతి జరిగిందని సభకు వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు