Road Accident: ఆంధ్రప్రదేశ్ లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తిరుపతిలోని సూళ్లూరుపేటలో కలకత్తా- చెన్నై జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది.
పాండిచ్చేరి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, అతి వేగంతో వెళ్లిన బస్సు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం. అయినా ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.