Future-city-metro
హైదరాబాద్

Airport Metro: ఎయిర్‌పోర్టు – ఫ్యూచర్ సిటీ… 40 నిమిషాలే జర్నీ!

రావిర్యాల్ మీదుగా గ్రీన్‌కారిడార్ మెట్రోరైలు
డీపీఆర్ సిద్ధం, సర్కార్‌కు అందించనున్న మెట్రో
మెట్రో కారిడార్లలో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యం
ఎయిర్‌పోర్టు – మెట్రో కారిడార్‌లో ఎన్వీఎస్ రెడ్డి ఫీల్డ్‌విజిట్

Airport Metro: హైదరాబాద్ మహానగరంలో నాలుగో నగరంగా ఫ్యూచర్‌సిటీకి క్రమంగా అడుగులు పడుతున్నాయి. జనవరి 1న సీఎం రేవంత్ ప్రకటించిన రెండు మెట్రో కారిడార్లపై కసరత్తు వేగవంతం కావటంతో పాటు ఎయిర్‌పోర్టు మెట్రోకు డీపీఆర్ సిద్ధమైనట్లు, సర్కారుకు మెట్రో రైలు అధికారులు సమర్పించనున్నట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టు నుంచి రావిర్యాల మీదుగా ఫ్యూచర్‌సిటీకి కేవలం 40 నిమిషాల్లోనే ప్రయాణించేలా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ నిర్మించే ప్రాంతాల్లో ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను ఎండీ అధ్యయనం చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రోకారిడార్ డీపీఆర్ తయారీకి జరుగుతున్న సర్వే పనులను మెట్రో ఎండీ తన క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించి, సూచనలు చేశారు. కొంగర‌కలాన్ తరువాత రోడ్డు లేకపోవడంతో కొండలు, గుట్టలు దాటుకుని ఆయన కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఏర్పాటు చేయనున్న కాలుష్యరహిత గ్రీన్ కారిడార్‌తో హైదరాబాద్ గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుతనగరాల సరసన చేరుతుందని చెప్పారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో‌రైల్ సంస్థ హెచ్ఏండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో‌రైల్ విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ పేరుకు అనుగుణంగా గ్రీన్ కారిడార్‌లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం 40 నిమిషాల్లోనే ఫ్యూచర్ సిటీకి చేరుకునేలా సీఎం రేవంత్ విజన్‌కు అనుకూలంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లతో పాటు, ఫ్యూచర్ సిటీ మెట్రోకారిడార్ డీపీఆర్ కూడా వచ్చే మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ క్షేత్ర పరిశీలనలో సంబంధిత ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టు కారిడార్ రూట్ ఇదీ..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్‌సిటీకి మెట్రో మార్గం దాదాపు 40 కిలో మీటర్లుంటుందని, అది ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై, కొత్తగా ఏర్పాటు చేయనున్న మెట్రోరైల్ డిపో పక్క నుంచి ఎయిర్‌పోర్ట్ కాంపౌండ్‌వాల్ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్‌పల్లి రోడ్డు గుండా 5 కిలోమీటర్లు ముందుకు వెళ్లి, పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్‌కి చేరుతుందని వివరించారు.

అత్యంత ఆకర్షణీయంగా రెండు మెట్రో‌స్టేషన్లు..

సర్కారు ఆదేశాల మేరకు బహదూర్‌గుడా‌లో ఉన్న దాదాపు వెయ్యి నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్‌గుడా, పెద్ద గోల్కొండలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్‌లో మెట్రో రైల్‌కి కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో ఈ కారిడార్‌ను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.

గ్రీన్‌ఫిల్డ్ రాహదారి మధ్యలో..

రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్‌ఖాన్‌పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రోరైల్‌కి కేటాయించినట్లు, రోడ్డు మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ‘ఎట్ గ్రేడ్’ (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ విశాలమైన రోడ్ మధ్యలో అదే లెవెల్‌లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

ALSO READ: 

Ind vs Pak: కింగ్ కోహ్లీ సెంచరీ.. పాకిస్థాన్‌కు చుక్కలు.. కోహ్లీ కొత్త రికార్డులు

 

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు