Donald Trump | అమెరికా అధ్యక్షుడు ఇండియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నడుమ పదే పదే భారత్ (bharath) గురించి మాట్లాడుతున్న ట్రంప్.. మరోసారి ఇండియా రాజకీయాలపై మాట్లాడాడు. రీసెంట్ గానే అమెరికా డోజ్ విభాగం అధ్యక్షుడు అయిన ఎలన్ మస్క్ (elon musk) ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇస్తున్న 21 మిలియన్ డాలర్ల ఫండింగ్ ను రద్దు చేశాడు. దాన్ని ట్రంప్ కూడా ఆమోదించాడు. డోజ్ అనేది అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులను తగ్గించే విభాగం. దీని బాధ్యతలను ఎలన్ మస్క్ కు ట్రంప్ అప్పగించాడు. చాలా ఏళ్లుగా ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్ల ఫండ్ ను అందజేస్తోంది.
తాజాగా దీన్ని రద్దు చేయడాన్ని ట్రంప్ సమర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసలు ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఎందుకు ఫండ్ ఇవ్వాలి. ఇండియా ఆర్థికంగా చాల బలమైన దేశం. కాబట్టి వాళ్లకు మన డబ్బు అవసరం లేదు. దీనిని బైడెన్ వ్యతిరేకిస్తున్నారు. బహుషా ఇండియాలో ఎవరినో వేరే వాళ్లను గెలిపించేందుకు వాళ్లు (బైడెన్ టీమ్) ప్రయత్నిస్తున్నారేమో’ అంటూ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు ఇండియా రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.