Donald Trump | ఇండియాకు ఆ ఫండ్ ఎందుకివ్వాలి ; ట్రంప్
Donald Trump
అంతర్జాతీయం

Donald Trump | ఇండియాకు ఆ ఫండ్ ఎందుకివ్వాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!

Donald Trump | డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే అక్రమ వలసదారులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నారు. ఖైదీలను తీసుకొచ్చినట్టు బంధించి మరీ పంపేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇండియా పట్ల మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించే వ్యవస్థ డోజ్ కు రీసెంట్ గా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (elon musk) ను అధ్యక్షుడిగా నియమించారు ట్రంప్. మస్క్ నేతృత్వంలోని ఈ డోజ్ విభాగం ఇప్పుడు ఇండియాకు ఇచ్చే ఫండ్ ను రద్దు చేసింది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం అందజేస్తున్న 21 మిలియన్ డాలర్ల ఫండ్ ను రద్దు చేశారు.

దీనిని తాజాగా డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నిధుల రద్దుపై క్లారిటీ ఇచ్చారు. ‘అసలు ఆ ఫండ్ ఎందుకు ఇవ్వాలి. ఇండియా వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. చాలా సంపన్న దేశాల్లో ఆ దేశం ఉంది. ఇండియా పట్ల, ఆ దేశ ప్రధాని పట్ల నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఇండియా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ఎందుకు ఫండ్ ఇవ్వాలి. మన దేశంలో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది’ అంటూ ట్రంప్ ప్రశ్నించారు.

ఈ నడుమ ఎలన్ మస్క్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ గెలుపులో మస్క్ చాలా కీలక పాత్ర పోషించారు. చాలా డబ్బు ఫండింగ్ చేశాడు. అందుకే ట్రంప్ గెలిచాక డోజ్ సంస్థ బాధ్యతలను ఎలన్ మస్క్ కు అప్పగించాడు. ట్రంప్ ప్రతి విషయంలో ఎలన్ మస్క్ కు సపోర్టు చేస్తూనే వస్తున్నాడు. ట్రంప్ గెలిచిన తర్వాత కేవలం అమెరికాకు లాభం చేసే పనులు మాత్రమే చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో చాలా ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాడు.

అలాగే విరాళాలను కూడా ఆపేస్తున్నారు. కొన్ని దేశాలకు అప్పటి వరకు అందిస్తున్న ఇతర సహాయాలను కూడా ట్రంప్ వెనక్కు తీసుకుంటున్నారు. దాంతో చాలా దేశాలు ట్రంప్ నిర్ణయాల పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయినా సరే ట్రంప్ మాత్రం ఇలాంటి పనులు అస్సలు ఆపట్లేదు.

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!