బీజేఎల్పీ సమావేశం అనంతరం శాసనసభాపక్ష నేత ఎంపిక
ఎల్లుండి ప్రమాణ స్వీకార కార్యక్రమం
పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా మధ్య నెలకొన్న పోటీ
హాజరుకానున్న అతిరథ మహారథులు
Delhi CM: హస్తినలో 27 ఏళ్ల తర్వాత గెలిచి కలను నిజం చేసుకుంది బీజేపీ (BJP). కానీ, సీఎం ఎంపిక విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతున్నది. పర్వేశ్ వర్మ (Pervesh Verma), రేఖా గుప్తా (Rekha Gupta) మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారని అంటున్నారు. ఇవాళ శాసనసభా పక్ష సమావేశంం జరగనుంది. ఈ భేటీలో శాసనసభా పక్ష నేతను, మంత్రులను డిసైడ్ చేయనున్నారు. ఈ సమావేశానికి 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలుస్తారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల ఉత్కంఠకు రేపు తెరపడనుంది.
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
సీఎం ఎవరనేది ఇంకా తేలకపోయినా, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. ఎల్లుండి(ఫిబ్రవరి 20) నూతన సీఎం ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీలోని రామ్ లీలా మైదానం ముస్తాబవుతున్నది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలవడంతో కాషాయ నేతలు ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ముందు సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణం చేస్తారని ప్రకటించగా, సమయం విషయంలో మంగళవారం మార్పు చేశారు. అన్నీ కుదిరితే ఉదయం 11 గంటలకే ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
కార్యక్రమానికి అతిరథ మహారథులు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. అలాగే, 50 మందికి పైగా సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నారు. అంతేకాదు, రైతులు, మురికివాడల్లో ఉండేవారు, కేంద్ర పథకాల లబ్ధిదారులను సైతం ఆహ్వానించినట్టు సమాచారం.
ఇవీ చదవండి
Ys Jagan | వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. మాజీ సీఎం జగన్ ఆరోపణ..!