Ycp leaders
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం

Ys Jagan | వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. మాజీ సీఎం జగన్ ఆరోపణ..!

Ys Jagan | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద తప్పుడు కేసు పెట్టారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. వైసీపీని (ycp) వేధిస్తున్న లీడర్ల అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. అసలు ఘటన జరిగినప్పుడు అక్కడ వంశీ (vamshi) లేడని.. అయినా సరే పట్టుబట్టి అతని పేరును ఇందులో చేర్చినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని.. ఆ టైమ్ లో రెండు పార్టీల నేతలపై కేసులు పెట్టినట్టు జగన్ గుర్తు చేశారు. మంగళవారం విజయవాడ సబ్ జైలులో వంశీని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వంశీని సీఎం చంద్రబాబు కావాలనే ఈ కేసులో ఇరికించినట్టు చెప్పారు.

‘టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో కూడా వంశీ పేరు లేదు. అసలు సంఘటన జరిగినప్పుడు వంశీ అక్కడ లేడు. వంశీకి ఈ కేసుకు అసలు సంబంధమే లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే సత్యవర్ధన్ ను పోలీసులు విచారించారు. అతను స్టేట్ మెంట్ లో వంశీ తనను తిట్టలేదని చెప్పాడు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సత్యవర్ధన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సత్యవర్ధన్ స్టేట్ మెంట్ ను మరోసారి రికార్డు చేశారు. రెండోసారి కూడా సత్యవర్ధన్ వంశీ పేరు ఎత్తలేదు. తనను కులం పేరుతో ఎవరూ తిట్టలేదని వివరించాడు. దీంతో ఎలాగైనా వంశీని ఇరికించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సత్యవర్ధన్ అన్నతో తప్పుడు కేసులు పెట్టించాడు. ఆ కేసులో వంశీని టార్గెట్ చేసి ఇందులో ఏ71గా చేర్చారు’ అని జగన్ పేర్కొన్నారు.

సత్యవర్ధన్ నుంచి ఆయన అన్న పెట్టిన కేసుపై స్టేట్ మెంట్ తీసుకోకుండానే వంశీని అరెస్ట్ చేశారని.. అరెస్ట్ చేసిన తర్వాత మళ్లీ దొంగ స్టేట్ మెంట్ రికార్డు చేశారని జగన్ ఆరోపించారు. వంశీని ఎలాగైనా జైల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని జగన్ చెప్పారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తున్నారని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టబోమని.. రిటైర్డ్ అయిన వాళ్లను కూడా పిలిపించి బట్టలూడదీస్తామని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వంశీ, కొడాలి నాని ఎదుగుతుంటే ఓర్చుకోలేక వేధిస్తున్నాడన్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం