Kohli food
స్పోర్ట్స్

Kohli ordered Special Food: చెఫ్ లేకపోవడంతో స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్న కోహ్లీ

Kohli ordered Special Food:  భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ మిగిలిన వారితో పోల్చలేం. అంత అద్భుతంగా ఉంటుంది. కారణం సింపుల్. ఎంతో కఠినమైన డైటింగ్‌ చేస్తాడు. ఎక్కడికి వెళ్లినా.. అదే డైట్ పాటిస్తాడు. బీసీసీఐ కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన పది ఆదేశాల మేరకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు అనుమతి లేకపోగా.. అలాగే వ్యక్తిగత చెఫ్‌నూ వెంట పెట్టుకొనేందుకు వీల్లేకుండా పోయింది. జట్టుకు బోర్డు నుంచి ప్రత్యేకంగా ఓ చెఫ్‌ను కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, డైట్ విషయంలో కఠినంగా ఉండే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకిష్టమైన ఆహారం కోసం ఓ మార్గం కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రాక్టీస్‌కు వచ్చిన కాసేపటికే.. ప్రాక్టీస్ వేదిక వద్దకు కోహ్లీకి ఫుడ్‌ డెలివరీ అయింది. ప్రత్యేకంగా చెఫ్‌ లేకపోవడంతో లోకల్ టీమ్‌ మేనేజర్‌కు చెప్పి తనకు కావాల్సిన వాటిని కోహ్లీ ప్యాకెట్ల రూపంలో తెప్పించుకున్నాడు. అంతేకాదు తన ఫుడ్ ఎలా చేయాలి? ఎలా ఉండాలనే దాని గురించి పూర్తిగా వివరించినట్లు తెలుస్తోంది. దీంతో సదరు మేనేజర్‌ వెంటనే ప్రసిద్ధిగాంచిన ఫుడ్ పాయింట్‌ నుంచి ప్యాకెట్లను తెచ్చి కోహ్లీకి అందించాడు. ప్రాక్టీస్‌ సెషన్ అనంతరం ఇతర క్రికెటర్లు తమ కిట్‌లను సర్దుకుంటూ ఉండగానే.. కోహ్లీ మాత్రం అక్కడే తన భోజనం పూర్తి చేశాడు. ప్రయాణంలోనూ తినేందుకు మరికొన్ని బాక్స్‌లను దాచుకున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

ఇవీ కూడా చదవండి 

Manchu Manoj Arrest: మంచు మనోజ్ అరెస్ట్.. మంత్రిని కలిసిన తర్వాత ఇలా!

Gujarath | గుజరాత్ లో సంచలనం.. యూట్యూబ్ లో మహిళా రోగుల ప్రైవేట్ వీడియోలు

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!