Manchu Manoj Arrest: గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ (Manchu Family Feud) రోజుకో ట్విస్ట్ తో సినిమాని తలపిస్తుంది. ఒకే ఫ్యామిలీ నుంచి భిన్న వాదనలు వినిపించడం ఆసక్తికరంగా కాదు అనుమానాస్పదంగా మారింది. వివాదానికి మూలకారణం ఆస్తి తగాదాలే ప్రధాన కారణమని మోహన్ బాబు( Mohan Babu) వెర్షన్ ఉంటే, అవి కేవలం అభాండాలు మాత్రమే అసలు విషయం వేరే ఉందని మనోజ్ చెబుతుండటం గమనార్హం. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబు యూనివర్సిటీ లో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై లేనిపోని కేసులు పెడుతున్నారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే బౌన్సర్లతో తగాదా ఏర్పడినట్లు చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ (Manchu Manoj Arrest) చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఏం జరిగిందంటే..
సోమవారం మంచు మనోజ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో అతిథిగా హాజరయ్యాడు. ఆయనకు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. గజమాలతో సత్కరించి బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి లోకేష్ ను (Nara Lokesh) కూడా కలిశారు. ఇప్పటి వరకు అంతా సాఫీగానే సాగింది కానీ.. తాజాగా ఆయనను తిరుపతి పరిధిలోని బాకారావుపేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉదయాన్నే ఈ న్యూస్ చూసి అందరు షాక్ అవుతున్నారు. కాగా, అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మరి కాసేపట్లో తెలియజేసే అవకాశాలున్నాయి. లోకేష్ ను కలిసిన కొన్ని గంటల తర్వాతే మనోజ్ అరెస్ట్ కావడం. అంతకు ముందు మంచు విష్ణు కూడా లోకేష్ ను కలవడం.. ఈ వివాదంలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
Also Read: ‘వెంకీ అట్లూరి’ ఎటుపోతున్నావ్ సామి..
జల్లికట్టులో మనోజ్ ఏమన్నాడంటే..
నిన్న జరిగిన జల్లికట్టు వేడుకల్లో మనోజ్ మాట్లాడుతూ.. ‘‘బ్రిటీష్ కాలం నుండి ‘జల్లికట్టు’ సంప్రదాయం ఉంది. సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 ఏళ్లుగా చంద్రగిరిలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. తమిళనాడు ‘జల్లికట్టు’తో పోల్చుకుంటే ఇక్కడ అంత సివియర్‌గా ఉండదు. ఇక్కడ అంతా సాప్ట్‌గా ఉంటుంది. పశువుల పండగగా చాలా భక్తితో జరుపుకుంటాం. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా, ముందుగా ఆలోచించుకుని ఇక్కడ ఈ వేడుకను జరుపుతుంటారు. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారు. పోలీసులు లా అండ్ అర్డర్ విషయంలో చాలా కేరింగ్‌గా ఉన్నారు. దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను.’’ అన్నారు. అలాగే తనకు స్వాగతం పలికిన టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
పోరా.. ఎస్‌కెఎన్‌పై మండిపడిన హీరోయిన్
Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను