Laila Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Laila Movie: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘లైలా’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా కనీసం పెట్టిన పెట్టుబడి కాదు కదా! ఆ సినిమాలో నటించిన ‘లైలా’ గెటప్‌కి వాడిన బట్టలు, మేకప్ ఖర్చు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయిందంటే ఎంతటి ఘోర పరాభవమో అర్థం చేసుకోవచ్చు. విశ్వక్‌సేన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలోనే ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచి, హీరోకే కాకుండా నిర్మాణ సంస్థకి కూడా భారీ షాకిచ్చింది. సినిమా విడుదలై 4 రోజులు పూర్తయింది. ఈ నాలుగు రోజులకుగానూ ఈ సినిమా కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలిస్తే అంతా షాక్ అవుతారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరో సినిమా తీస్తేనే మినిమం 3 నుండి 4 కోట్ల వరకు కలెక్షన్లు ఉంటాయి. అలాంటిది విశ్వక్‌సేన్ సినిమాకు విడుదలైన నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ. 3 కోట్లు అంటే, ‘లైలా’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read: Sreeleela: బాలీవుడ్ వెళ్లగానే ఆ ముద్దులేంటి శ్రీలీల?

మేకప్ – సెట్స్ ఖర్చు కూడా రాలేదట
విశ్వక్‌సేన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘లైలా’. దాదాపు రూ. 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించడంతో..‘లైలా’ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో ఎంతగా ఫెయిల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ‘లైలా’ పాత్రకి వాడిన బట్టలు, మేకప్ ఖర్చు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయిందని టాక్. ముఖ్యంగా ‘లైలా’ పాత్ర మేకప్ మెటీరియల్‌కు మరియు సెట్స్‌కు కోట్లలో ఖర్చయిందట. ఇంకా విశ్వక్‌సేన్ ఈ సినిమాకు రూ. 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకు రూ. 7 కోట్లకు ఈ సినిమా రైట్స్ ఇచ్చినా, సినిమా డిజాస్టర్ అయింది కాబట్టి ఆ అమౌంట్ కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నారట. ఓటీటీ రైట్స్‌ని లెక్కలోకి తీసుకుంటే ఈ సినిమా 25 శాతం మాత్రమే రికవరీ అయిందని, 75 శాతం లాస్‌తో నిర్మాతని తీవ్ర నష్టాలలోకి నెట్టేసిందనేలా టాక్ వినబడుతోంది. మొత్తంగా అయితే, నిర్మాత భారీగా మునిగిపోయాడన్నది మాత్రం వాస్తవం. మరి ఈ పరాజయంలో తప్పెవరిది? నిర్మాతదా? దర్శకుడిదా? హీరోదా? సినిమా విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎవరూ ఈ సినిమాను తీసుకునేందుకు ముందుకు రాలేదని.. కేవలం నిర్మాతకి తదుపరి సినిమా చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఉండటంతో, దానిని దృష్టిలో పెట్టుకుని కొంత మేరకు అడ్వాన్స్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలిసింది.

విశ్వక్‌సేన్ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభంజనం ఎక్కువైన తర్వాత సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైనప్పటి నుండే, సినిమా వైబ్ ఏంటనేది తెలిసిపోతుంది. మొదటి నుండి ‘లైలా’కు బిజినెస్‌లో బజ్ రాలేదు. ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వచ్చినా కూడా ‘లైలా’ని కాపాడలేకపోయాడు. సినిమాపై ఉన్న కాస్త బజ్‌ని థర్టీ ఇయర్స్ పృథ్వీ అథ:పాతాళానికి తొక్కేశాడు. చివరికి హీరో విశ్వక్‌సేన్, పృథ్వీ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ బుల్లిరాజుతో స్కిట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఎవరు ఎన్ని చేసినా.. ఈ నవనవలాడుతున్న ‘లైలా’ని ఆదుకోలేకపోయారు. ఫలితంగా విశ్వక్‌సేన్ కెరీర్‌లోనే అతి పెద్ద పరాజయంగా ‘లైలా’ చెత్త రికార్డును నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి:

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?