Sreeleela and Karthik Aryan
ఎంటర్‌టైన్మెంట్

Sreeleela: బాలీవుడ్ వెళ్లగానే ఆ ముద్దులేంటి శ్రీలీల?

Sreeleela: సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ వెళ్లగానే వారిలో బీభత్సమైన మార్పు కనిపిస్తుంది. ఇక్కడ కాస్త పద్ధతిగా ఉన్న వాళ్లు బాలీవుడ్ వెళ్లగానే, పద్దతిని పక్కనెట్టి రొమాంటిక్‌గా మారిపోతున్నారు. బాలీవుడ్‌ హీరోలతో రొమాన్స్ చేస్తూ చెలరేగిపోతున్నారు. మహానటి కీర్తి సురేష్‌కి సౌత్‌లో ఎలాంటి గుర్తింపు ఉందో, ఆమె ఇటీవల బాలీవుడ్ అరంగేట్రం చేసిన సినిమాలో ఎలా రెచ్చిపోయిందో.. చూసిన వారంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలకు మరింత బలం చేకూరుస్తూ.. టాలీవుడ్ క్రష్ శ్రీలీల కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న సినిమాలో ముద్దులతో అల్లాడించేసింది. శ్రీలీల ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు.

Also Read: Krishnaveni: ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత మృతి

సినిమాకు ఇంకా పేరు అయితే పెట్టలేదు కానీ, ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల జతకడుతోంది. ఫస్ట్ లుక్ టీజర్‌గా వచ్చిన ఈ వీడియోలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ జంటను చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమా గుర్తొస్తుంది. ‘ఆషికి 3’ అని ఈ సినిమాకు పేరు వినబడుతుంది కానీ, ఈ టీజర్ చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి 2’ అని పెడితే బాగుంటుంది అంటూ అప్పుడే నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. అంతగా ఇందులో ఈ జంట మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు.

టాలీవుడ్‌లో మొదటి సినిమా అనంతరం దాదాపు 10 సినిమాలకు సైన్ చేసి, టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారిన శ్రీలీల, ఇంకా అరంగేట్రం చేస్తున్న సినిమా విడుదలవకుండానే.. వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. బాలీవుడ్‌లోనూ తన గ్లామర్ సత్తా చాటుతోంది. తాజాగా విడుదలైన వీడియో విషయానికి వస్తే.. ఇందులో కార్తీక్ ఆర్యన్ ఓ సింగర్‌గా కనిపిస్తున్నారు. భారీ గడ్డంతో, గిటార్ వాయిస్తున్న లుక్‌లో కార్తీక్ ఆర్యన్‌ని పరిచయం చేయగా.. ఆయనకు లవర్ పాత్రలో శ్రీలీలను రివీల్ చేశారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నట్లుగా, లిప్ లాక్స్ ఉన్నట్లుగా ఈ వీడియో హింట్ ఇచ్చేస్తుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. త్వరలోనే చిత్ర టైటిల్, ఇతర విషయాలను మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం మంచి మెలోడీ బిట్‌తో వచ్చిన ఈ వీడియో అయితే టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Jr NTR: ‘బ్రహ్మా ఆనందం’పై ఎన్టీఆర్ పోస్ట్ వైరల్..

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?