Madarasi Movie First Look
ఎంటర్‌టైన్మెంట్

SKxARM: శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

SKxARM: స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అనౌన్స్‌మెంట్‌తోనే అంచనాలు పెరిగిపోయాయి. ఒకప్పుడు బిగ్ స్టార్స్‌తో భారీ హిట్స్ ఇచ్చిన మురుగదాస్‌కు ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసేందుకు ఆయన వరుస సినిమాలతో రాబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో ఆయన చేస్తున్న ‘సికిందర్’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు శివకార్తికేయన్‌తో ఆయన చేస్తున్న సినిమా విశేషాలు కూడా ఒక్కొక్కటిగా రివీలవుతున్నాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ.. మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉందో.. ఈ సినిమా టైటిల్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏమిటంటే..

Also Read: Sreeleela: బాలీవుడ్ వెళ్లగానే ఆ ముద్దులేంటి శ్రీలీల?

హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు (ఫిబ్రవరి 17) స్పెషల్‌గా మురుగదాస్‌తో ఆయన చేస్తున్న చిత్రానికి ‘మదరాసి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ.. టైటిల్ గ్లింప్స్‌ని కూడా మేకర్స్ వదిలారు.హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు.. విజువల్‌గానూ వండర్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. టైటిల్ గ్లింప్స్ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. టైటిల్ రివీల్ చేస్తూ.. వదిలిన పోస్టర్‌లో హీరో శివకార్తికేయన్ పవర్ ప్యాక్డ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శివకార్తికేయన్ చేస్తున్న ఈ సినిమాపై మాములుగానే అంచానాలు ఉండగా.. ఈ టైటిల్‌తో మరింతగా ఈ సినిమా జనాల్లోకి వెళ్లనుంది.

‘మదరాసి’ టైటిల్ గ్లింప్స్ వీడియోని గమనిస్తే.. సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడా ఈ గ్లింప్స్‌లో పరిచయం చేశారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ హై-క్లాస్ విజువల్స్, తమిళ రాక్ స్టార్ అనిరుద్ ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్‌‌తో పాటు, స్టోరీ టెల్లింగ్‌లో ఇంటెన్సివ్‌ని కనబరిచే ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని సరికొత్త ఎక్సయిటింగ్ యాక్షన్-ప్యాక్డ్‌గా మలుస్తున్నారనే విషయాన్ని ఈ గ్లింప్స్ లోని ప్రతి ఫ్రేమ్ తెలియజేస్తుంది.

శివకార్తికేయన్ సరసన యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ (‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో బిజు మీనన్, విద్యుత్ జామ్వాల్, షబీర్, విక్రాంత్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు మురుగదాస్‌కు ఈ సినిమా ఎంతో కీలకం కానుంది. ఎందుకంటే, ఆయన నుండి సరైన సినిమా పడి చాలా కాలం అవుతోంది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో ఆయన చేస్తున్న సినిమాపై కూడా మంచి బజ్ ఉంది.ఈ రెండు సినిమాలు కనుక హిట్ అయితే.. కొంతకాలం పాటు మురుగదాస్‌కు ఇక తిరుగుండదని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు