Rekhachithram OTT: తెలుగు సినిమా టాప్‌లో దూసుకెళుతున్నప్పటికీ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు మాత్రం కనిపించకుండా కామ్‌గా ప్రేక్షకులను ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడలాంటి చిత్రమే ఒకటి ఓటీటీలోకి రాబోతోంది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 75 కోట్ల వసూళ్లను రాబట్టిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రేఖా చిత్రం’. మలయాళ క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ఎంత ఉత్కంఠగా ఉంటాయో మరోసారి చాటి చెప్పిన చిత్రమిది. జోఫిన్ టి. చాకో దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీపై వేణు కున్నప్పిల్లి నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని ఘన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది.
Also Read- Vishwambhara: మెగాస్టార్‌తో మేనల్లుడు.. ‘విశ్వంభర’ తాజా అప్డేట్ ఇదే!
తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఈ సినిమాను దక్కించుకున్న ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఇంతకీ ఆ ఓటీటీ ఏదని అనుకుంటున్నారా? సోనీ లివ్. మార్చి 7న సోనీ లివ్‌లో ‘రేఖా చిత్రం’ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న సందర్భంగా ఇందులో ప్రధాన పాత్రలో నటించిన ఆసిఫ్ అలీ మాట్లాడుతూ..‘ఇందులోని వివేక్ పాత్రకు జీవం పోయడం, ఆ పాత్రకు న్యాయం చేయడం నాకు ఓ పెద్ద సవాలుగా అనిపించింది. నిజంగా ఇలాంటి పాత్రలు పోషించడం అంత సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకుల అంచనాలు, ఊహకు అందకుండా ఈ చిత్రం ఉంటుంది. సినిమా నడుస్తున్నంత సేపూ.. వాస్తవానికి, ఊహకు మధ్య ఆడియెన్స్ నిజాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. థియేటర్లలో మా సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మార్చి 7న సోనీ లివ్‌లోకి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్‌లలో కూడా అందుబాటులోకి వస్తుంది. ఓటీటీ వీక్షకులను కూడా మా సినిమా మెప్పిస్తుందని కచ్చితంగా చెప్పగలనని అన్నారు.
‘రేఖా చిత్రం’ కథ విషయానికి వస్తే..
‘మలక్కప్పర’ ప్రాంతంలో జరిగే ఘటనలు, అక్కడ జరిగిన ఓ ఆత్మహత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పోలీసు ఇన్‌స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు అతనికి పెద్ద సవాలుగా మారుతుంది. ఎటు వెళ్లినా ఆ కేసు ఓ కొలిక్కి రాదు. చివరకు అదే కేసు.. ఇలాంటి మరో కేసుకి లీడ్ ఇస్తుంది. సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి ఘటనలతో ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ కథ నడుస్తుంది. గ్రిప్పింగ్ కథనం, ఊహించని మలుపులు ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేస్తాయి. క్షణం కూడా పక్కకు తిప్పుకోనివ్వకుండా ఎంగేజ్ చేస్తాయి. ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్, మనోజ్ కె. జయన్, సిద్దిక్, జగదీష్, సాయికుమార్ వంటివారు నటించిన ఈ చిత్రానికి ముజీబ్ మజీద్ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
Chandoo Mondeti: గుండెల్లో గునపంతో పొడిచినట్లనిపించింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను
Mangli Open Letter: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. అదంతా ఫేక్ ప్రచారం
Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!
