Hari Hara Veera Mallu: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న.. ‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ సినిమాలు ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ‘హరి హర వీర మల్లు’ నుంచి రిలీజైన ‘మాట వినాలి’ అంటూ సాగే పాట మంచి ఆదరణ పొందింది. దీనికి పవన్ కళ్యాణ్ గాత్రం, పెంచల్ దాస్ లిరిక్స్, కీరవాణి సంగీతం హైలెట్ గా నిలిచాయి. తాజాగా ఈ చిత్ర మేకర్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా మరో సర్‌ప్రైజింగ్ సింగిల్‌ని అనౌన్స్ చేశారు.
ఈ మూవీని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తుండగా.. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ పీరియడ్ డ్రామాలో మొదటి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ సరసన నటిస్తోంది. నేడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. మేకర్స్ ‘కొల్లగొట్టిందిరో’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పాట ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అనుపమ్‌ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్త కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: