Aswaraopeta Municipality: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా కాకుండా ప్రజాసేవ కోణంలో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 13వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఆధార్ పార్టీ తరఫున బరిలోకి దిగిన రాయల పోలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సుదీర్ఘకాలంగా జర్నలిస్టుగా ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన కలం వీరుడు రాయల పోలయ్య అశ్వరావుపేట ప్రజలకు కొత్త పరిచయం కాదు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు సమాన దూరంలో నిలిచి నిజాయితీగా వార్తలు అందించిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం, స్పష్టమైన మాట తీరు, ప్రజల పట్ల నిబద్ధత ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
Also Read: Revanth Reddy: హార్వర్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తిచేసుకున్న సీఎం రేవంత్.. ఆసక్తికరమైన ట్వీట్
ఎన్నికల బరిలోకి..
మొట్టమొదటిసారిగా అశ్వరావుపేటలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, మూడవ రోజు నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన రాయల పోలయ్య, గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగారు. జర్నలిస్టుగా సమస్యలను ప్రశ్నించిన అనుభవాన్ని, కౌన్సిలర్‌గా పరిష్కారాలుగా మార్చాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.“ప్రజల గొంతుకగా కలం పనిచేసింది. ఇప్పుడు అదే గొంతుకకు అధికార బలం కల్పించాలన్నదే నా ఆశయం” అని పోలయ్య స్పష్టం చేస్తున్నారు. వార్డు అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేయడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. 13వ వార్డు ఓటర్లు తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించాలని, ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మీడియా ద్వారా రాయల పోలయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. కలం పట్టిన చేతికి ఇప్పుడు ప్రజల మద్దతు లభిస్తే, 13వ వార్డులో నిజమైన ప్రజాపాలనకు బాటలు వేయవచ్చన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.
Also Read: MP Etela Rajender: మీ అవసరాలు తీర్చే నాయకున్ని ఎన్నుకోండి: ఎంపీ ఈటెల రాజేందర్

