Hydraa: నాలా ఉందని పక్క భూమి కబ్జా
–హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు
–స్పందించిన ఫీల్ట్ విచారణ చేపట్టి చర్యలు
–హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: కొనుగోలు చేసుకున్న భూమిని కాదని పక్కనున్న భూమిని కబ్జా చేశారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా అబ్ధుల్లాపూర్మెట్టు మండలం పెద్ద అంబర్పేట్ రెవెన్యూ పరిధిలోని ఓ వెంచర్ ప్లాట్లతో పాటు రహదారిని సంబంధం లేని వ్యక్తి కబ్జా చేయడం గమానర్హం. సర్వే నెంబర్ 265లో 278 ప్లాట్లు శబరిహిల్స్ పేరుతో లేఅవుట్ చేశారు. అయితే ఆ లేవుట్ పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఎకరం భూమిని కొనుగోలు చేసుకున్నారు. ఈ కొనుగోలు చేసిన భూమిలో చెరువుల నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్లే నాలా ఉండటంతో పక్క వెంచర్లో కి జరిగి కబ్జా చేశారు. ఈ విషయం తెలుసుకున్న లేవుట్ యాజమాన్యులు హైడ్రా కార్యాలయంలోని ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన అధికారులు వారం రోజుల్లో క్షేత్రస్థాయిలోనున్న భూమిని పరిశీలించి హద్దు రాళ్లు, సర్వే నెంబర్లను తెలుసుకోని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: February 1 New Rules: ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే.. ఎవరిపై ప్రభావం ఉంటుందంటే?
265 సర్వే నెంబర్లో..
అయితే 265 సర్వే నెంబర్లో శబరిహిల్స్ లేవుట్ ఉండగా, ఆ లేవుట్కు అనుకోని ఉన్న 346 సర్వే నెంబర్లో ఎకరం భూమి ఉంది. ఈ రెండు సర్వే నెంబర్లు వేరు వేరు కావడం, హద్దుల్లో తేడా లేదు. కానీ ఎకరం భూమి కొనుగోలు చేసిన వ్యక్తం నాలా ఉండటంతో పక్క భూమిలోనున్న 20 ప్లాట్లను, రహదారిని తొలగించి కబ్జా చేశారు. సుమారుగా 20 ప్లాట్ల విలువ రూ.3కోట్లకు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ భూమిని కబ్జాదారుడి నుంచి చెరవిడిపించి బాధితులకు అప్పగించడం విశేషం. కబ్జా చేసిన భూమిలో పాతిన రాళ్లను, నిర్మాణాలను హైడ్రా అధికారులు దగ్గరుండి జేసీబీ సహాయంతో తొలగించడం విశేషం. హైడ్రా తీసుకున్న చర్యలపై బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: MP Etela Rajender: మీ అవసరాలు తీర్చే నాయకున్ని ఎన్నుకోండి: ఎంపీ ఈటెల రాజేందర్

