Vivo V70 & V70 Elite Leaks: విడుదలకు ముందే ఫీచర్లు లీక్..!
Vivo V70 & V70 Elite Leaks
Technology News, లేటెస్ట్ న్యూస్

Vivo V70 & V70 Elite Leaks: విడుదలకు ముందే.. Vivo V70, V70 Elite ఫీచర్లు లీక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Vivo V70 & V70 Elite Leaks: దేశంలో మంచి క్రేజ్ ఉన్న మెుబైల్ కంపెనీల్లో వివో బ్రాండ్ ఒకటి. మెుబైల్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా వివో ఎప్పటికప్పుడు సరికొత్త మెుబైల్స్ ను లాంచ్ చేస్తూ ఉంటుంది. మిడ్ రేంజ్ బడ్జెట్ లో అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లకు ఇటీవల కాలంలో వివో కేరాఫ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే త్వరలో ‘వి సిరీస్’ నుంచి మరో రెండు ఫోన్లను విడుదల చేసేందుకు వివో సిద్ధమైంది. Vivo V70, V70 Elite పేరుతో నయా మెుబైల్స్ తీసుకురాబోతున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది. అయితే విడుదలకు ముందే ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

వివో తీసుకురాబోతున్న వి70 లైనప్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.59 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను ఈ ఫోన్లకు అమర్చినట్లు సమాచారం. వివో V70 సిరీస్‌లో 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, 50MP 3x ZEISS టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. AI హోలీ ఫెస్టివ్ పోర్ట్రెయిట్ మోడ్, AI మ్యాజిక్ వెదర్, ఫ్లవర్ బ్లెస్సింగ్ వంటి దేశీయంగా బాగా పాపులర్ అయిన ఫీచర్లు V70 ఫోన్‌లలోనూ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Revanth Reddy: హార్వర్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ పూర్తిచేసుకున్న సీఎం రేవంత్.. ఆసక్తికరమైన ట్వీట్

వివో V70 లైనప్‌లో 6,500mAh బ్యాటరీ ఉండనున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఇది పనిచేయవచ్చని పేర్కొంటున్నాయి. వివో V70, V70 ఎలైట్ రెండు కలర్ వేరియంట్లలో విడుదల కావొచ్చని సమాచారం. Vivo V70 ప్యాషన్ రెడ్, లెమన్ ఎల్లో రంగుల్లో రానుండగా.. V70 ఎలైట్ శాండ్ బీజ్, బ్లాక్ కలర్ లో మార్కెట్ లో లభించవచ్చని ప్రచారం జరుగుతోంది. కాగా వివోలో ఇప్పటివరకూ వచ్చిన వి సిరీస్ మెుబైల్స్.. రూ.28,999 నుంచి రూ.49,999 వరకూ ఉన్నాయి. కాబట్టి రాబోయే Vivo V70, V70 Elite మెుబైల్స్ ధరలు కూడా ఆ రేంజ్ లోనే ఉండే అవకాశముందని తెలుస్తోంది.

Also Read: Realme 16 5G: రియల్‌మీ నుంచి టాప్ రేటెడ్ ఫోన్.. ఫీచర్లు ఏంటి భయ్యా.. ఇంత బాగున్నాయ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?