GHMC: జీహెచ్ఎంసీ విభాగాల పునర్వవస్థీకరణపై అధికారులు ఫోకస్!
GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ విభాగాల పునర్వవస్థీకరణపై అధికారులు ఫోకస్.. రెవెన్యూలో ఎస్టేట్ విలీనం?

GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత పెరిగిన జీహెచ్ఎంసీ(GHMC) పరిధి పునర్విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఇపుడు జీహెచ్ఎంసీలో అంతర్గతంగా ఉన్న వివిధ రకాల సేవలందించే విభాగాల పునర్ వ్యవస్థీకరణపై ఫోకస్ పెట్టారు. విలీనానికి ముందు జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వివిధ విభాగాల వారీగా అందిస్తున్న సేవలు విలీన పట్టణ స్థానిక సంస్థల్లో అందుబాటులో లేకపోవటంతో విలీన ప్రాంతాల్లోనూ జీహెచ్ఎంసీ తరహాలో అన్ని విభాగాలను యాక్టీవ్ చేసేందుకు వివిధ విభాగాలను ప్రక్షాళన చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్లు సమాచారం.

అత్యవసర సేవల విభాగాల్లో..

ముఖ్యంగా జీహెచ్ఎంసీలోనున్న విభాగాల్లో చాలా వరకు విభాగాలు విలీన పట్టణ స్థానిక సంస్థల్లో లేకపోవటాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ఇపుడు విలీన ప్రాంతాలన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో రావటంతో ఆ ప్రాంతాల్లో కూడా జీహెచ్ఎంసీ పాత పరిధిలో అందిన సేవలన్నీ పునరుద్దరించేదుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విలీనానికి ముందు జీహెచ్ఎంసీలో పలు విభాగాల్లో కావల్సిన స్థాయిలో సిబ్బంది, అధికారులున్నా, ఏడాది పొడువున వారు నిర్వహించే కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉండగా, మరి కొన్ని విభాగాలు అందించే సేవలు, అత్యవసర సేవల విభాగాల్లో కావల్సిన స్థాయిలో సిబ్బంది అందుబాటులో లేదన్న విషయాన్ని గుర్తించిన అధికారులు అత్యవసర పౌర సేవలందించే వివిధ వింగ్ లను పటిష్టం చేసి, కావల్సిన స్థాయిలో సిబ్బంది నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. విలీనానికి ముందు పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్థిక లావాదేవీలు చూసుకునే విభాగాలను ఫైనాన్స్, రెవెన్యూగా విభజించారు. వీటిలో ఎస్టేట్ విభాగం కూడా ఉన్నప్పటికీ, ఎస్టేట్ విభాగంలోని సిబ్బంది కేవలం జీహెచ్ఎంసీ ఆస్తుల నుంచి అద్దెలను వసూలు చేస్తున్నారు.

Also Read: Bhatti Vikramarka: పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి.. నాణ్యత పర్యవేక్షణకు 40 కొత్త స్టేషన్లు ఏర్పాటు : భట్టి విక్రమార్క!

రెవెన్యూలో ఎస్టేట్ విలీనం?

జీహెచ్ఎంసీ పాత పరిధిలో 30 సర్కిళ్లు, 650 చదరపు కిలోమీటర్లలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు దాదాపు 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, మరో 300 పై చిలుకు బిల్ కలెక్టర్లుండగా, విలీన ప్రాంతాలతో కలిపి అదనంగా మరో 254 డాకెట్లను ఏర్పాటు చేసి వాటి పరిధిలో ట్యాక్స్ కలెక్షన్ చేసేందుకు 254 మంది వార్డు ఆఫీసర్ హోదా కల్గిన సిబ్బందిని ఇన్ ఛార్జి బిల్ కలెక్టర్లుగా నియమించారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ట్యాక్స్ స్టాఫ్ ఏడాది పొడువున ట్యాక్స్ కలెక్షన్, ఎలక్షన్ విధులు వంటివి నిర్వహిస్తుంటారు. అలాగే ఎస్టేట్ విభాగంలో కేవలం అద్దెలు వసూలు చేసేందుకు మాత్రమే అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్లున్నారు. వీరు అద్దెలను సకాలంలో, పారదర్శకంగా వసూలు చేయటం లేదన్న విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఈ వసూళ్ల బాధ్యతలను ట్యాక్స్ స్టాఫ్‌కు అప్పగించాలని భావిస్తున్నట్లు, ఎస్టేట్ సిబ్బందికి పెరిగిన విస్తీర్ణంలో ఇతర బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే తరహాలో హెల్త్, లీగల్, స్పోర్ట్స్, వెటర్నరీ, ఎంటమాలజీ విభాగాల్లో అందుబాటులో ఉన్న స్టాఫ్‌ను బట్టి ప్రక్షాళన చేసి, జీహెచ్ఎంసీ తరహా సేవలు విలీన ప్రాంతాల్లో అందించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విభాగాల పునర్ వ్యవస్థీకరణపై వచ్చే నెల 10వ తేదీ తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

Also Read: Realme 16 5G: రియల్‌మీ నుంచి టాప్ రేటెడ్ ఫోన్.. ఫీచర్లు ఏంటి భయ్యా.. ఇంత బాగున్నాయ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?