Vishwak Sen
ఎంటర్‌టైన్మెంట్

Hit 3: ‘హిట్’ యూనివర్స్‌కు విశ్వక్ దూరం

Hit 3: ప్రస్తుతం హీరో విశ్వక్ సేన్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఒకవైపు ‘లైలా’ సినిమా కాంట్రవర్సీ విశ్వక్‌ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో విశ్వక్ అభిమానులకు మరో షాక్ తగిలింది. నాని సొంత బ్యానర్‌లో.. డైరెక్టర్ శైలేష్ కొలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫ్రాంచైజీ HIT (HIT Universe). ఈ సినిమా మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండవ భాగంలో అడివి శేష్ నటించగా మూడో భాగంలో నాని నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడో పార్టులో ముగ్గురు హీరోలతో ఒక మాస్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ శైలేష్.

అయితే ఈ ‘హిట్ 3’లో విశ్వక్ నటించడం లేదని కొన్ని వార్తలు ప్రచారమైన విషయం తెలిసిందే. దీంతో విశ్వక్ అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఆ వార్తల్లో నిజం లేదని ఎవరైనా ధృవీకరిస్తే బాగుండు అని భావించారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. విశ్వక్ హిట్ 3లో నటించడం లేదని క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. నానితో పాటు కేవలం అడివి శేష్ మాత్రమే ఈ యూనివర్స్ లో కనిపించనున్నాడట. అయితే విశ్వక్ సీన్స్ ని కొంతవరకు ఓల్డ్ ఫుటేజ్ తో మేనేజ్ చేయనున్నట్లు సమాచారం.

Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!

మరోవైపు హిట్ 4( HIT 4)లో నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు వరించిన నేపథ్యంలో.. హిట్ టీమ్( నాని, శేష్, శైలేష్) అందరు కలిసి బాలయ్యను కలిసి ఊహాగానాలకు ఊపిరిపోశారు. ఇదిలా ఉండగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి: 

Ranveer Allahbadia: ప్రధాని చేతుల మీదుగా అవార్డు, ఇప్పుడు దారుణంగా ట్రోల్.. ఎవరి రణ్‌వీర్ అల్లాబాదియా?

Prabhas: బలవంతుడైన ప్రభాస్‌కి మరింత బలం చేకూరింది..

Just In

01

Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?