Janasena MLA Controversy: జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఐదుసార్లు అబార్షన్ చేయించారని బాధిత మహిళ ఇటీవల ఆరోపించారు. రైల్వే కోడూరులోని సంజీవని ఆస్పత్రిలో రెండుసార్లు అబార్షన్ జరిగిందంటూ పేర్కొన్నారు. అయితే తమ ఆసుపత్రిలో ఎలాంటి అబార్షన్ జరగలేదంటూ తాజాగా సంజీవిని హాస్పిటల్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బాధితురాలు అబార్షన్ రిపోర్ట్ బయటపెట్టడం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది.
‘మేం అబార్షన్ చేయలేదు’
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో మోసపోయి.. రైల్వేకోడూరులోని సంజీవిని ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకున్నానని మూడు రోజుల క్రితం బాధిత మహిళ ఓ వీడియోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా సదరు ఆస్పత్రి వైద్యులు దీనిపై స్పందించారు. డాక్టర్ సి. శివ కిశోర్ యాదవ్.. బాధితురాలి ఆరోపణలను ఖండించారు. గత ఏడాది సెప్టెంబర్ 5న తమ ఆసుపత్రికి బాధితురాలు వచ్చిందన్న డాక్టర్.. కానీ తాము ఎలాంటి అబార్షన్ చేయలేదని స్పష్టం చేశారు. తమ ఆసుపత్రిలో భార్యభర్తలు సమ్మతం మేరకే చట్ట పరంగా వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఆమెకు ప్రెగ్నెన్సీ కిట్ చట్టబద్దంగానే అందించామన్నారు.
ఆధారం బయటపెట్టిన బాధితురాలు
సంజీవిని ఆస్పత్రిలో ఎలాంటి సర్జరీలు అయినా.. పేషెంట్ల పూర్తి వివరాలు రికార్డు చేసిన తర్వాతే నిర్వహిస్తామని డాక్టర్ శివ కిశోర్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే సంజీవిని ఆస్పత్రి చేసిన ప్రకటనను బాధితురాలు ఖండించారు. గతేడాది జులై 8న అదే ఆస్పత్రిలో తనకు చేసిన అబార్షన్ కు సంబంధించిన రిపోర్టును ఆమె విడుదల చేశారు. దీంతో మరోమారు ఎమ్మెల్యే రాసలీలల అంశం ఏపీలో తీవ్ర దుమారానికి కారణమైంది. కాగా వైసీపీ నేతలు తనను ప్రలోభపెట్టి.. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారంటూ జరుగుతున్న ఆరోపణలను సైతం గురువారమే బాధితురాలు ఖండించారు.
Also Read: AP TG Water Dispute: గురుదక్షిణ కోసం.. తెలంగాణకు ద్రోహం చేస్తారా? సీఎంను నిలదీసిన హరీశ్ రావు
మరో ఆడియో క్లిప్ వైరల్..!
ఇదిలా ఉంటే జనసేన నేత తాతంశెట్టి నాగేందర్ వాయిస్ కాల్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో తాజాగా చక్కర్లు కొడుతోంది. శ్రీధర్ కు చపలత్వం ఎక్కువని, రాంగ్ ట్రాక్ లో పోతున్నాడని.. ఇన్ స్టాలో మెసేజ్ లకు తప్పుగా స్పందించాడని.. పిల్ల చేష్టలు చేస్తున్నాడని, అతడి ఇంట్లోని పెద్దోళ్లకు చెప్పానని.. బాధితురాలికి సర్దిచెబుతున్నట్లుగా ఆ ఆడియో ఉంది. అయితే అదే ఆడియోలో మహిళ దీటుగా బదులిస్తూ.. కుక్కను చూసినా శ్రీధర్ వదిలిపెట్టడంటూ ఫోన్ ను పెట్టేసిన క్లిప్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

