AP TG Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల (Water Disputes) పరిష్కారం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జల సంఘం భేటి కాబోతోంది. కాసేపట్లో దిల్లీలో ఈ భేటి మెుదలు కానుండగా.. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. దిల్లీ కేంద్రంగా తెలంగాణకు జలద్రోహం జరగబోతోందంటూ ఆరోపణలు చేశారు. ఈ భేటిలో ఏదైనా తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందన్నారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబు (CM Chandrababu)ది అయితే పొడిచేది రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరో చారిత్రక ద్రోహం
సమైక్య పాలనలో నీటి వాటాల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేయబోతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఈరోజు దిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతోందని ఆరోపించారు. ‘పోలవరం, నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నది. పోను పోను అనుకుంటూనే ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ మీటింగ్ కు వెళ్ళారు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసారు’ అని హరీశ్ రావు అన్నారు.
గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే ఉంది.. తప్పు జరిగి ఉంటే తెలంగాణ నీటి చరిత్రలో ఈ రోజు బ్లాక్ డేగా నిలిచిపోతుంది
– మాజీ మంత్రి హరీశ్ రావు
BRS party has been alerting the state government from the very… pic.twitter.com/A5Uasi3itJ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2026
ఏపీ జల దోపిడీకి కార్పెట్
కమిటీ వేయను అంటూనే రెండు రాష్ట్రాల అధికారుల ఆధ్వర్యంలో కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేశారని హరీశ్ రావు ద్వజమెత్తారు. ‘టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించారు. పక్కా ప్లాన్ ప్రకారం సహకరిస్తూ.. చంద్రబాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తున్నారు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో ఇవాళ ఇంజినీర్లు పాల్గొంటున్నారు. పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర ఇది’ అని హరీశ్ రావు ఆరోపించారు.
Also Read: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మరోమారు సిట్ నోటీసులు!
తెలంగాణకు ద్రోహం
గతంలో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ‘ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారు. ఎందుకు ఈరోజు మీటింగ్ కు ఎగేసుకొని పోయారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడు, మీరైనా ఎందుకు పట్టించుకోరు ఉత్తం గారు. ఈ మీటింగ్ కు వెళ్లేది ఆదిత్యా నాథ్. గతంలో 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఆదిత్యా నాథ్ దాస్.. కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్ లు అన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిలిపి వేయాలని చెప్పాడు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్ కు పంపడం అంటే తెలంగాణ ద్రోహం చేయడానికే కాదా?’ అని హరీశ్ రావు నిలదీశారు.

